కలం, వెబ్డెస్క్: పిన్నెల్లి సోదరులను కలవడానికి వెళ్తున్న వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి, యాంకర్ శ్యామల(Anchor Shyamala) ను మాచర్ల పోలీసులు అడ్డుకున్నారు. అనుమతులు లేవంటూ నిరాకరించారు. అనంతరం ఆమెకు నోటీసులు ఇచ్చి వెనక్కి పంపారు. శ్యామల (Anchor Shyamala) భర్తను సైతం పోలీసులు అడ్డుకున్నట్లు సమాచారం. కాగా, గుండ్లపాడు జంట హత్యల కేసులో పిన్నెల్లి సోదరులు రామకృష్ణారెడ్డి, వెంకట రామిరెడ్డిల బెయిల్ రద్దు చేసిన సుప్రీంకోర్టు.. ఆ ఇద్దరూ రెండు వారాల్లోగా కోర్టులో లొంగిపోవాలని ఆదేశించిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో గడువు ముగియడంతో గురువారం పిన్నెల్లి సోదరులు కోర్టులో లొంగిపోయారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు మాచర్లకు ర్యాలీగా వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో పల్నాడు జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో పోలీసులు జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ విధించారు. వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులను, శ్రేణులను ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. చాలా మందిని హౌస్ అరెస్ట్ చేశారు.
Read Also: మార్ఫింగ్ న్యూడ్ ఫొటోలపై సింగర్ చిన్మయి రియాక్షన్
Follow Us On: X(Twitter)


