కలం డెస్క్ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఎన్సీపీ అధినేత శరద్‌పవార్ ఇచ్చిన విందుకు హాజరయ్యే నిమిత్తం బుధవారం రాత్రి ఢిల్లీ వెళ్ళిన ఆయన.. గురువారం ఉదయం పార్లమెంటు క్యాంటీన్‌లో సరదా కబుర్లలో మునిగిపోయారు. రాష్ట్రానికి చెందిన వివిధ పార్టీలకు చెందిన ఎంపీలతో సంభాషణలు జరిపారు. BJPకి చెందిన డీకే అరుణ, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, రఘునందన్‌రావు తదితరులతో పాటు మజ్లిస్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, TDP ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు, NCP ఎంపీ సుప్రియా సూలె, రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీలతో సరదాగా గడిపారు.
రెండు రోజుల పాటు నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్ (Global Summit) గురించి వారి మధ్య చర్చ జరిగింది. దేశ, విదేశీ ప్రతినిధులు హాజరై పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడం రాష్ట్ర అభివృద్ధికి మంచి పరిణామమని, గ్రాండ్ సక్సెస్ అయినందుకు సీఎం రేవంత్‌రెడ్డిని అభినందించారు. దీనికి ముందు రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీలంతా సీఎం రేవంత్‌ను సన్మానించారు.
కాంగ్రెస్ పెద్దలతోనూ సీఎం రేవంత్ (Revanth Reddy) భేటీ :
ఢిల్లీ పర్యటనలో భాగంగా కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, ప్రియాంకాగాంధీ, ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ తదితరులతో విడివిడిగా భేటీ అయిన సీఎం రేవంత్… రెండు రోజుల గ్లోబల్ సమ్మిట్ సక్సెస్, రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు, వివిధ కంపెనీలు చూపిన ఆసక్తి, త్వరలో అవి గ్రౌండింగ్ కావడానికి ఉన్న అవకాశాలు, రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలపై వివరించారు. విజన్ డాక్యుమెంట్‌లో రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తావించిన అంశాలు, వివరించిన రోడ్ మ్యాప్, అవి ఆచరణరూపం దాల్చడానికి చేయాల్సిన కృషి తదితరాలపైనా వివరణ ఇచ్చారు.
రెండేండ్ల పాలనలో సాధించిన ప్రగతి, ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల అమలు, త్వరలో రూపొందించనున్న పలు స్కీమ్‌లు, ప్రస్తుతం జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికలు, ఫిబ్రవరిలో జరగనున్న రాష్ట్ర బడ్జెట్ సమావేశాలకు సమాయత్తం, ఆ తర్వాత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణ, ఏప్రిల్‌లో జరపనున్న జీహెచ్ఎంసీ ఎన్నికలు.. వీటిపైన కూడా చర్చ జరిగినట్లు తెలిసింది.
Read Also: లోక్‌సభ ప్రాంగణంలో టీఎంసీ ఎంపీ స్మోకింగ్!
Follow Us On: Youtube


