epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

లోక్​సభ ప్రాంగణంలో టీఎంసీ ఎంపీ స్మోకింగ్!

కలం, వెబ్​డెస్క్​: లోక్​సభ ప్రాంగణంలో ఒక ఎంపీ స్మోకింగ్ (TMC MP Smokes) చేశారనే విషయం గురువారం స్పీకర్ దృష్టికి వచ్చింది. తృణమూల్​ కాంగ్రెస్​ ఎంపీ ఒకరు స్మోకింగ్​ చేసినట్లు బీజేపీ ఎంపీ అనురాగ్​ ఠాకూర్​ ఆరోపించారు. ఆ ఎంపీ కొన్ని రోజులుగా లోక్​సభ ప్రాంగణంలో ఇ–సిగరెట్లను తాగుతున్నట్లు తాను గమనించానని స్పీకర్​ స్పీకర్​ ఓం బిర్లాకు (OM Birla) ఫిర్యాదు చేశారు. ​ఆ ఎంపీ పేరును ఠాకూర్​ ప్రస్తావించలేదు. ఈ సంఘటనపై విచారణ జరిపించి, సదరు ఎంపీపై చర్యలు తీసుకోవాలని స్పీకర్​ను  ఠాకూర్​ కోరారు. ‘దేశంలో ఇ–సిగరెట్లపై నిషేధం ఉంది. ఈ విషయాన్ని సభ్యులు గుర్తుంచుకోవాలి. లోక్​సభ ప్రాంగణంలో టీఎంసీ ఎంపీ ఒకరు కొన్ని రోజులుగా ఇ–సిగరెట్​ స్మోకింగ్ (TMC MP Smokes)​ చేస్తున్నారు. అతనికి ప్రత్యేక అనుమతి ఉందేమో తెలియదు.’ అని ఠాకూర్​ అన్నారు. మరోవైపు శీతాకాల సమావేశాల్లో ఎన్నికల సంస్కరణలపై జరగుతున్న చర్చ గురువారం సైతం వాడీవేడిగా కొనసాగింది.

Read Also: లోడ్‌తో దిగితే బ్యాటరీ ఫుల్.. చైనా ట్రక్కులకు కొత్త టెక్నాలజీ

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>