కలం, వెబ్ డెస్క్ : ఫుట్ బాల్ స్టార్ ప్లేయర్ లియోనల్ మెస్సీ (Lionel Messi) భారత పర్యటనకు వస్తున్న విషయం తెలిసిందే. గోట్ ఇండియా టూర్ (GOAT India Tour 2025) లో భాగంగా ఈ నెల 13న హైదరాబాద్ కు రానున్న దిగ్గజప్లేయర్ మెస్సీ.. ఉప్పల్ స్టేడియంలో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా 20 నిమిషాల పాటు ఫుట్ బాల్ మ్యాచ్ జరగనుంది. ఇందులో సీఎం రేవంత్ రెడ్డి చివరి 5 నిమిషాలలో పాల్గొంటారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఫలక్ నుమా ప్యాలెస్ లో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మెస్సీతో ఫోటో దిగే అవకాశం కూడా కల్పించారు.
అయితే, రూ.10 లక్షలు చెల్లిస్తేనే మెస్సీ (Lionel Messi) తో ఫోటో దిగే అవకాశం ఉంది. కేవలం వంద మందికి మాత్రమే ఛాన్స్ ఉంటుందని గోట్ ఇండియా టూర్ హైదరాబాద్ నిర్వాహక కమిటీ సలహాదారు పార్వతిరెడ్డి ప్రకటన చేశారు. ఆసక్తి ఉన్నవారు డిస్ట్రిక్ట్ యాప్ లో అందుబాటులో ఉన్న టికెట్లు తీసుకోవచ్చని పేర్కొన్నారు. శనివారం హైదరాబాద్ లో జరిగే మ్యాచ్ లో మెస్సీతో పాటు రోడ్రిగో డిపాల్, లూయిస్ సువారెజ్ కూడా స్టేడియంకి వస్తారు.
Read Also: షాకింగ్.. 50 శాతం US గ్రాడ్యుయేట్లకు ఉద్యోగాలు నిల్!
Follow Us On: Youtube


