Mobile Popup Ad
Mobile Popup Ad

నిఖిల్ ‘స్వయంభు’ నుంచి ఫస్ట్ సాంగ్.. థియేట్రికల్ విజువల్స్‌తో సర్‌ప్రైజ్

కలం, సినిమా : టాలీవుడ్‌లో వైవిధ్యమైన కథలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరో నిఖిల్ సిద్ధార్థ్ (Nikhil Siddharth). ఇప్పుడు ఈ యంగ్ హీరో మరో భారీ ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో నిఖిల్ “స్వయంభు” (Swayambhu) అనే భారీ సినిమా చేస్తున్నాడు. ఈ బిగ్గెస్ట్ పీరియాడిక్ మూవీలో నిఖిల్ ఒక యోధుడిలా కనిపించనున్నాడు. నిఖిల్ సరసన సంయుక్త మీనన్, నభా నటేష్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రానికి కే.కే. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. రవి బ్రసూర్ మ్యూజిక్ అందిస్తున్నారు.

ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకులలో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో, ఈరోజు సాయంత్రం 6:03 గంటలకు “స్వయంభు” (Swayambhu) నుండి ‘రారా ధీవరా’ (Ra Ra Dheevara) అనే ఫస్ట్ సాంగ్ విడుదల కానుందని నిఖిల్ తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ పాట కేవలం సంగీతానికే పరిమితం కాకుండా, సినిమా నేపథ్యాన్ని, ముఖ్యంగా యోధుల ప్రపంచాన్ని పరిచయం చేసే కీలక భాగంగా ఉండబోతోందని తెలిపాడు. ‘గెట్ రెడీ టు బి బ్లోన్ అవే’ అంటూ నిఖిల్ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్‌గా మారింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>