కలం, వెబ్‌డెస్క్ : హైదరాబాద్ గచ్చిబౌలిలోని సోలార్ రూఫ్ సైక్లింగ్ ట్రాక్ (Gachibowli Solar Roof Cycling Track) మీద కొందరు చేసిన పనులు వివాదాస్పదంగా మారాయి. 23 కిలోమీటర్ల పొడవు ఉన్న సోలార్ రూఫ్ సైక్లింగ్ ట్రాక్ పై ఓ కాంగ్రెస్ నాయకుడు అంత్యక్రియలకు సంబంధించి గుండ్లు కొట్టించుకోవడం.. పెద్దకర్మలు, స్నానాలు లాంటి కార్యక్రమాలు చేశారు. దీనికోసం వాటర్ ట్యాంకర్ ను పెట్టడంతో పాటు పబ్లిక్ ట్రాక్ ను పూర్తిగా అడ్డుకున్నారు. సైక్లింగ్ కోసం వచ్చిన వారు ఇదేంటని ప్రశ్నించగా ‘మాకు సీఎం తెలుసు, సర్పంచ్ తెలుసు’ అని చెబుతూ బెదిరించారని అక్కడ ఉన్నవాళ్లు చెప్పారు.
అయితే, 2023లో భారత్ లో మొదటి, ప్రపంచంలో రెండో సోలార్ రూఫ్ సైక్లింగ్ పాత్ (Gachibowli Solar Roof Cycling Track) నిర్మించారు. ఇంత విలువైన ప్రాంతంలో అంత్యక్రియలకు సంబంధించిన కార్యక్రమాల నిర్వహించడంపై సైక్లిస్టులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాప్రయోజనాల కోసం నిర్మించిన ప్రాంతంలో ఇలాంటి పనులు చేయడం ఏంటని ప్రశ్నించారు. అంతేకాకుండా ఇదేంటని అడిగినందుకు బెదిరిస్తున్నారని సైక్లిస్టులు ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఘటనపై పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. సైక్లిస్టులు, ప్రజల భద్రత కోసం ట్రాక్ పై సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
Read Also: పాడైన గోధుమలు పంపారు.. నాణ్యమైన బియ్యం ఇస్తున్నాం..
Follow Us On: Instagram


