కలం, వెబ్ డెస్క్: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ (Mahesh Babu) ఒకవైపు సినిమాలు చేస్తూనే, మరోవైపు వ్యాపార రంగంలోనూ దూసుకుపోతున్నాడు. ఇప్పటికే గచ్చిబౌలిలో AMB మల్టీపెక్స్ థియేటర్ ఫ్రారంభించిన ఆయన మరిన్ని మల్టీపెక్స్‌ను నిర్మించబోతున్నాడు. అత్యాధునిక ఫీచర్స్‌తో నిర్మించిన AMB ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ మల్టీపెక్స్‌కు మంచి క్రేజ్ ఉండటంతో సామాన్యుల నుంచి సెలబ్రిటీ వరకు అందులో సినిమాలు చూస్తున్నారు. అభిమానులు సైతం AMBలోనే సినిమాలు చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు.
ప్రస్తుతం మహేష్ (Mahesh Babu) మూడో బ్రాంచ్‌ను ప్రారంభించనున్నట్టు సమాచారం. హైదరాబాద్‌లోని హకీంపేటలో మరో AMB బ్రాంచ్ ప్రారంభించనున్నాడు. ’ఎఎంబీ కమింగ్ సూన్‘.. అంటూ అందుకు సంబంధించిన పోస్టర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 2027 నాటికి ఈ మల్టీపెక్స్ అందుబాటులోకి రానున్నట్టు తెలుస్తోంది.
AMB సినిమాస్‌ను మహేష్ మొదట 2018 చివరలో హైదరాబాద్‌లోని ఆసియన్ సినిమాస్ భాగస్వామ్యంతో గచ్చిబౌలిలో ప్రారంభించాడు. ఈ లగ్జరీ మల్టీప్లెక్స్ ఊహించనిదానికంటే అభిమానులను ఆకట్టుకుంది. దీంతో AMBకి బ్రాండ్ ఏర్పడింది. అలాగే ఆర్టీసీ క్రాస్ రోడ్డులో రెండో బ్రాంచ్ ప్రారంభించనున్నట్టు గతంలోనే ప్రకటించారు. ఆ తర్వాత హకీంపేటలో మూడో బ్రాంచ్ ఓపెన్ కాబోతోంది. ఎఎంబీకి మంచి రెస్పాన్స్ రావడంతో గోవా, చెన్నై లాంటి నగరాల్లో మరిన్ని మల్టీపెక్స్ ప్రారంభించేందుకు మహేశ్ ఆసక్తి చూపిస్తున్నారు. ఈ మూడు బ్రాంచీలకు ఆదరణ వస్తే.. సినిమాల్లో మాదిరిగా మహేష్ మల్టీపెక్స్ నిర్మాణంలోనూ దూసుకుపోవడం ఖాయమేనని అభిమానులు భావిస్తున్నారు.
Read Also: ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో ఉద్యోగాలకు నోటిఫికేషన్
Follow Us On: Youtube


