epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

మీ డబ్బు మీరు తీసుకోండి : ప్రధాని మోదీ

కలం, వెబ్​డెస్క్​: బ్యాంకుల్లో రూ.78వేల కోట్లు.. బీమా కంపెనీల్లో రూ.14వేల కోట్లు.. మ్యూచువల్​ ఫండ్స్​ కంపెనీల్లో రూ.12వేల కోట్లు.. ఈ లెక్కలు ఏంటో తెలుసా?.. అన్​క్లెయిమ్డ్​ సొమ్ము. అంటే, ఎవరో తమ పేరుతోనో, తమవాళ్ల పేరుతోనో దాచుకున్న సొమ్ము.. ఇన్సూరెన్స్​లు, మ్యూచువల్​ ఫండ్స్​, డివిడెంట్స్​ ద్వారా పొందాల్సిన సొమ్ము. కానీ, ఏళ్ల తరబడి ఈ సొమ్ము బ్యాంకుల్లో మూలుగుతూనే ఉంది. సరైన ఆధారాల్లేక, ఆయా ఖాతాల్లో మిగిలిపోయిన రూ.లక్షకోట్లకు పైగా సొమ్మంతా ప్రజలదే. ఇందులో మనవి, మనకు తెలిసినవాళ్లవి ఉండొచ్చు. ఈ సొమ్ము వాటి అసలైన హక్కుదారులకు చేరితే చాలు. చాలా మందికి జీవితాలే మారిపోతాయి. కానీ, తీసుకోవడం ఎలా అంటారా?కేంద్ర ప్రభుత్వం ‘యువర్​ మనీ, యువర్​ రైట్​’ (Your Money Your Right) ద్వారా అవకాశం కల్పిస్తోంది. దీనిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Modi) బుధవారం తన లింక్డిన్​ ఖాతాలో ఒక పోస్ట్​ పెట్టారు.

ఆ సొమ్మంతా మీదే..

ప్రధాని మోదీ పోస్ట్​లో ఏముందంటే..‘బ్యాంకుల్లో, ఎల్​ఐసీల్లో, మ్యూచువల్​ ఫండ్స్​లో వేలాది మంది శ్రామికుల, ఎన్నో కుటుంబాల సేవింగ్స్​, పెట్టుబడి సొమ్ము ఏళ్ల తరబడి మూలుగుతోంది. ఇదంతా వాటి హక్కుదారులకు చేరడానికి అక్టోబర్​లో ‘యువర్​ మనీ, యువర్​ రైట్​’ (Your Money Your Right) అనే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టాం. ఈ పనిని అత్యంత పారదర్శకంగా, వేగంగా, సులభంగా జరిగేందుకు వీలుగా ఆర్​బీఐ–ఉద్గమ్​ పోర్టల్​, ఐఆర్​డీఏఐ బీమా భరోసా పోర్టల్​, సెబీ–మిత్ర పోర్టల్​, కార్పొరేట్​ వ్యవహారాల శాక ఐఈపీఎఫ్​ఏ పోర్టల్​ అందుబాటులోకి తెచ్చాం. రెండు నెలల్లోనే వీటి ద్వారా సుమారు రూ.2వేల కోట్లను అసలైన హక్కుదారులకు చేర్చాం. అలాగే అన్​క్లెయిమ్డ్​ ఖాతాల్లో మీకు సంబంధించిన సొమ్ము ఉంటే, ఆధారాలు సమర్పించి తీసుకోవాలి.’ అని ప్రధాని మోదీ కోరారు.

Read Also: ప్రభాస్, అర్జున్ కపూర్ మాత్రమే నాకు పర్ఫెక్ట్ మ్యాచ్ -కృతి సనన్

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>