కలం, వెబ్‌డెస్క్ : సినిమాల్లో నటించి రాజకీయాల్లోకి వచ్చిన వారు చాలా మందే ఉన్నారు. కానీ, రాజకీయాల్లో బిజిగా ఉంటూ మూవీస్ లో నటించిన వాళ్లు.. అదికూడా ఆరంగ్రేటం చేసిన నేతలు చాలా తక్కువ మందే ఉంటారు. ఈ లిస్టులో ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసం శెట్టి సుభాశ్ (Minister Vasamsetti Subhash) చేరారు. ప్రతి రోజు పర్యటనలకు వెళ్తూ బీజీగా ఉండే మంత్రి సినిమాల వైపు అడుగు వేశారు.
‘ఎవరది’ (Evaradi) మూవీలో వాసంశెట్టి (Minister Vasamsetti Subhash) నటిస్తున్నారు. ఈ సినిమాలో మంత్రి జమిందార్ క్యారెక్టర్ చేస్తున్నారని తెలిసింది. ఈ మేరకు ఏలూరు జిల్లా పెదపాడులో జరిగిన సినిమా షూటింగ్ లో మంత్రి వాసంశెట్టి పై సీన్స్ చిత్రికరించారు. ‘ఎవరది’ సినిమాకు వట్టి శ్యామ్ నిర్మాత, జుత్తిగ వెంకట్ డైరెక్టర్ వ్యవహరిస్తుండగా మెగా మూవీ బ్యానర్ పై తెరకెక్కుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న మూఢనమ్మకాలు, దాని వెనుక సాగిస్తున్న ఆడపిల్లల బలుల నేపథ్యంలో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. కాగా, మంత్రి వాసంశెట్టి సుభాష్ సినిమాల్లోకి రావడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
Read Also: గూగుల్ ఏఐ ప్లస్ వచ్చేసింది
Follow Us On: Instagram


