epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

టీ20 గెలుపుకు అతడే కారణం: సూర్యకుమార్

కలం డెస్క్: కటక్ వేదికగా మంగళవారం జరిగిన ఐదు టీ20ల సిరీస్ తొలి మ్యాచ్‌లో భారత్ 101 పరుగుల తేడాతో సౌతాఫ్రికాపై ఘన విజయం సాధించింది. 176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆఫ్రికా బ్యాటర్లు ఇండియన్ బౌలింగ్ దాడికి తట్టుకోలేక 74 పరుగులకే కుప్పకూలారు. ఈ విజయంపై టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) మ్యాచ్ అనంతరం స్పందించాడు.

బ్యాటింగ్ డెప్త్, హార్దిక్ పాండ్యా(Hardik Pandya) కీలక ఇన్నింగ్స్, బౌలర్ల అద్భుత ప్రదర్శనలే గెలుపు సాధ్యమయ్యేలా చేశాయని సూర్యా పేర్కొన్నాడు. “టాస్ సందర్భంగా ఈ పిచ్ గురించి 50-50గా భావించాం. ముందుగా బ్యాటింగ్ చేసే అవకాశం రావడం మా అదృష్టం. 48/3 పరిస్థితి నుంచి 175 పరుగులు చేయడం అసాధారణం. హార్దిక్, అక్షర్, తిలక్ వర్మ అద్భుతంగా ఆడారు. చివర్లో జితేష్ కూడా మంచి మద్దతు ఇచ్చాడు,” అని చెప్పాడు.

“160 పరుగులు చేస్తే సరిపోతుందని అనుకున్నాం. కానీ 175 మా అంచనాలకు మించి. జట్టులో 7-8 మంది బ్యాటర్లు ఉండడం మా పెద్ద బలం. ఇద్దరు, ముగ్గురు విఫలమైనా మిగతా వాళ్లు మ్యాచ్‌ను నిలబెడతారు. ఈ రోజు అలానే జరిగింది. తదుపరి మ్యాచ్‌లో మరొకరు రాణిస్తారు. టీ20 క్రికెట్ అంటే ఇలానే– నిర్భయంగా, స్వేచ్ఛగా ఆడాలి. ప్రస్తుతం భారత్ మంచి జోష్‌లో ఉంది,” అని సూర్యకుమార్ (Suryakumar Yadav) విశ్వాసం వ్యక్తం చేశాడు.

భారత్ విజయంలో బ్యాటర్ల పాటు బౌలర్లు కూడా కీలక పాత్ర పోషించడంతో సిరీస్‌పై టీమిండియా బలమైన పట్టు సాధించింది.

Read Also: పృథ్వీ షా కోసం పోటీ పడుతున్న ఐపీఎల్ ఫ్రాంచైజీలు !

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>