epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

దీపావళికి యునెస్కో విశ్వఖ్యాతి

కలం, వెబ్​డెస్క్​: మన దీపావళి (Deepavali) కి విశ్వఖ్యాతి దక్కింది. ముంగిట్లో వెలుగు దివ్వెలు.. వాడవాడలా బాణసంచా పేలుళ్లతో దేశవ్యాప్తంగా జరుపుకునే ఈ పండగను యునెస్కో (UNESCO) తన ఇన్​టాంజిబుల్​ కల్చరల్​ హెరిటేజ్​ ఆఫ్​ హ్యుమానిటీ జాబితాలోకి చేర్చింది. ఈ మేరకు యునెస్కో ‘ఎక్స్​’ ఖాతాలో ప్రకటించగా, ప్రధాని మోదీ రీ ట్వీట్​ చేశారు. మన సంస్కృతి, విలువలకు ప్రతీక అయిన దీపావళికి యునెస్కో గుర్తింపు దక్కడం భారతీయులందరికీ గర్వకారణమని ఆయన తన ట్వీట్​లో పేర్కొన్నారు. దీపావళి పండుగ గురించి అంతర్జాతీయంగా వివరించడం, ఈ పండుగ విశిష్టతను కాపాడుతూ భావితరాలకు భద్రంగా అందించడానికి యునెస్కో కృషి చేస్తుంది. కాగా, ప్రస్తుతం ఢిల్లీలోని ఎర్రకోట వద్ద యునెస్కో ఇన్​టాంజిబుల్​ కల్చరల్ హెరిటేజ్​(ఐసీహెచ్​) 20వ సమావేశం జరుగుతోంది. ఈ నెల 8న ప్రారంభమైన ఈ సమావేశం 13వరకు కొనసాగనుంది. ఇందులో వివిధ దేశాల ప్రతినిధులు పాల్గొంటున్నారు.

యునెస్కో (UNESCO) ప్రపంచ వారసత్వ సంపద(వరల్డ్​ హెరిటేజ్​ సైట్స్​)కు ఈ ఇన్​టాంజిబుల్​ కల్చరల్​ హెరిటేజ్​ లిస్ట్​ విభిన్నం. ఇందులో పండుగలు, ప్రాచీన కళలు, నృత్యం, ఆచారాలు వంటి వాటికి చోటు కల్పిస్తారు. ప్రస్తుతం ఈ బాబితాలో భారత్​ నుంచి చేరిన దీపావళి (Deepavali) 16వది. మిగిలినవి కుటియాట్టమ్​, వేద పారాయణం, రామ్​లీల, రమ్మన్​, ఛావూ, కల్​బేలియా, ముదియేట్టు, బౌద్ధ స్తుతి, సంకీర్తన, వెండి–రాగి కళాకృతులు, నవ్రోజ్​, యోగా, కుంభమేళా, దుర్గాపూజ, గార్భా నృత్యం.

Read Also: టీ20 గెలుపుకు అతడే కారణం: సూర్యకుమార్

Follow Us On: Pinterest

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>