కలం, వెబ్ డెస్క్: వెంకటేష్ (Venkatesh), త్రివిక్రమ్ కాంబినేషన్‌లో ఓ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీకి సంబంధించిన ఆసక్తికరమైన అప్డేట్‌ను మూవీ టీం షేర్ చేసింది. ‘ఆదర్శ కుటుంబం హౌస్ నం. 47, AK47’ అనే టైటిత్‌తో ఫస్ట్ లుక్‌ను విడుదల చేసింది. హైదరాబాద్‌లో షూటింగ్ అధికారికంగా ప్రారంభమైంది. వెంకటేశ్ గత సినిమా మాదిరిగా టైటిల్ ఆకట్టుకునేవిధంగా ఉంది. కాస్ట్‌లీ ఫ్యామిలీమ్యాన్‌గా వెంకటేష్ కనిపించబోతున్నాడు. ఫస్ట్ లుక్‌తోనే హీరో వెంకటేష్ మూవీపై అంచనాలు పెంచేలా చేశాడు. త్రివిక్రమ్ (Trivikram) హాస్యంతో కూడిన భావోద్వేగ ఫ్యామిలీ మూవీలను తెరకెక్కించడంలో మంచి పట్టుంది. వెంకటేష్ శైలికి తగ్గటుగా ఈ మూవీని తీసుకురాబోతున్నాడు. ‘ఆదర్శ కుటుంబం’ 2026 సమ్మర్ రిలీజ్ కోసం ప్లాన్ చేస్తున్నాడు.
ఈ చిత్రాన్ని Haarika & Hassine Creationsలో ఎస్. రాధా కృష్ణ (చినబాబు) నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ ప్రారంభం కావడంతో ఈ మూవీ టీం త్వరలో మరిన్ని అప్డేట్స్ వదిలే అవకాశాలున్నాయి. హీరో వెంకటేశ్‌కు (Venkatesh) ఫ్యామిలీ ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉంది. గతంలో ఆయన నుంచి వచ్చిన ఎన్నో సినిమాలు బాక్సాఫీస్‌లో మంచి రికార్డులు నమోదు చేశాయి. నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరీ, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే లాంటి సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. దీంతో ‘ఆదర్శ కుటుంబం’ మూవీపై అంచనాలు ఏర్పడ్డాయి.
Read Also: పృథ్వీ షా కోసం పోటీ పడుతున్న ఐపీఎల్ ఫ్రాంచైజీలు !
Follow Us On: Youtube


