కలం డెస్క్ : భారతదేశ యువ చెస్ ప్లేయర్ ప్రజ్ఞానంద (Praggnanandhaa) మరో మైలురాయిని అందుకున్నాడు. FIDE సర్క్యూట్ టోర్నీలో అదరగొట్టి విజేతగా నిలిచాడు. అంతేకాకుండా ఫిడేలో విజయం సాధించి 2026 క్యాండిడేట్స్ టోర్నీకి అర్హత పొందాడు. భారత్ నుంచి ఓపెన్ విభాగంలో అర్హత సాధించిన ఏకైక ఆటగాడు ప్రజ్ఞానంద కావడం విశేషం. ఈ సీజన్‌లో ప్రజ్ఞానంద ప్రదర్శన అద్భుతంగా ఉంది. వరుసగా టాటా స్టీల్ మాస్టర్స్, సూపర్‌బెట్ క్లాసిక్, ఉజ్ క, లండన్ క్లాసిక్ టోర్నీల్లో టైటిళ్లు సాధించాడు. అలాగే సింక్యూఫీల్డ్ కప్‌లో రన్నరప్‌గా నిలిచి తన స్థాయిని మరోసారి నిరూపించాడు.
క్యాండిడేట్స్ టోర్నీలో ఇప్పటివరకు అర్హత పొందిన వారు:
ప్రజ్ఞానంద (భారత్)
అనీష్ గిరి
ఫాబియానో కరువానా
మతియాస్ బ్లూబమ్
సిందరోవ్
వీయీ
ఆండ్రీ ఇస్పెంకో
ఎనిమిదో స్థానాన్ని వచ్చే ఆరు నెలల్లో అత్యుత్తమ ఫిడే రేటింగ్ సగటుతో ఉన్న ఆటగాడు దక్కించుకుంటాడు. ప్రస్తుతం ఆ అవకాశాలు అమెరికా గ్రాండ్‌మాస్టర్ హికారు నకమురా వైపే ఉన్నట్లు చెస్ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇక మహిళల విభాగంలో భారత్ మరోసారి ఛాయ చూపించింది. దివ్య దేశ్‌ముఖ్, కోనేరు హంపి, ఆర్. వైశాలీ ఇప్పటికే అర్హత సాధించారు. భారత చెస్ ప్రపంచ వేదికపై ఆధిపత్యాన్ని పెంచుకుంటున్న వేళ ప్రజ్ఞానంద (Praggnanandhaa) ప్రవేశం భారత్‌కు మరో పెద్ద బూస్ట్‌గా భావిస్తున్నారు.
Read Also: తెలంగాణ విజన్ అద్భుతం: ఆనంద్ మహీంద్రా
Follow Us On: X(Twitter)


