కలం, వెబ్‌డెస్క్ : భారత దేశంలో అనేక విమానయన సంస్థలు (Indian Airlines) వచ్చాయి. వైమానిక రంగంలో కొన్ని సంస్థలు విలాసవంతమైన ఫైట్లను తీసుకొస్తే కొన్ని చౌకగా టికెట్లను పెట్టి సామాన్యులకు కలను నిజం చేశారు. కానీ, ఆకాశమే హద్దుగా ఎగిరిన విమాన సంస్థలు కొద్దిరోజులకే నేల చూపులు చూడడం ప్రారంభించాయి. పెరుగుతున్న అప్పులు, ఇంధనం ఖరీదుగా మారడం, సరైన నిర్ణయాలు తీసుకోవడం ఇలాంటి కారణాలుగా ఉన్నాయి. లగ్జరీ విమానం కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ నుంచి చౌకైన గోఫస్ట్ విమానా సర్వీసు వరకు ఒక్కోక్కరిది ఒక్కో కథ. విమానయాన మంత్రిత్వ శాఖ సమాచారం ప్రకారం.. అసలు విమానయాన సంస్థలు(Indian Airlines) ఎందుకు మూతపడ్డాయో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
జెట్ ఎయిర్‌వేస్
1993లో ప్రారంభమైన జెట్ ఎయిర్ వేస్.. నాలుగు బోయింగ్-737 విమానాలను లీజుకు తీసుకుని సర్వీసులను నడిపేది. 1995లో సాధారణ ప్రయాణికుల సర్వీసులను నడిప హోదా లభించింది. 2000 సంవత్సరంలో జెట్ ఎయిర్ వేస్ గా అభివృద్ధి చెంది డొమెస్టిక్ సర్వీసులతో పాటు ఇంటర్నేషనల్ సర్వీసులను ప్రారంభించింది. సాఫీగా సాగుతున్న జెట్ ఎయిర్ వేస్ ప్రయాణంలో 2018లో భారీ నష్టాలు వచ్చాయి. దీంతో సంస్థను నడపేలేని స్థితికి చేరుకుంది. నిధుల కొరతతో అనేక సర్వీసులు నిలిచిపోయాయి. దీంతో 2019 ఏప్రిల్ లో తమ సర్వీసులను జెట్ ఎయిర్ వేస్ నిలిపివేసింది. ఆ తరువాత బ్యాంకులు కొత్త బిడ్లను ఆహ్వానించిన సరైన పెట్టుబడులు రాకపోవడంతో ఎయిర్ వేస్ మరుగున పడిపోయింది.
కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్
2003లో కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ కు ఎయిర్ ఆపరేటింగ్ పర్మిట్ జారీ అయింది. అయితే, ఇంధన ధరల్లో పెరుగుదల, అధిక ఖర్చుల, ఆదాయం తగ్గడంతో సంస్థ నష్టాలు రావడంతో వేల కోట్ల అప్పుల్లో కూరుకుపోయింది. ఎయిర్ డెక్కన్ ను కొనుగోలుచేసినా లాభాలను రాబట్టలేకపోయింది. కంపెనీ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని స్థితికి కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ దిగజారిపోయింది. దీంతో విమానాల రద్దు ప్రారంభమయింది. చివరికి 2012లో డీజీసీఏ కంపెనీకి అనుమతులు రద్దు చేసింది.
గో ఎయిర్..
తక్కువ ధరకే సర్వీసులను అందించే సంస్థల్లో గో ఎయిర్ ముందుగా ఉంటుంది 2005 మొదలైన సంస్థ 2021 లో గోఫస్ట్ గా పేరు మార్చారు. తరచుగా ఇంజిన్ల సమస్యల కారణంగా 56 విమానాల్లో 26 సర్వీసులే నడిచాయని సంస్థ వెల్లడించింది. ఇది గోఎయిర్ నష్టపోవడానికి కారణం అయింది. విమాన సర్వీసుల్లో అంతరాయం ఏర్పడడం వల్ల వేల మంది ప్రయాణికులు నష్టపోయారని 2025లో గోఫస్ట్ ను లిక్విడేషన్ చేయాలని ఎన్సీఎల్టీ ఆదేశించింది. కంపెనీ ఆస్తులను అమ్ముకోవాల్సి వచ్చింది. దీంతో కంపెనీ తన 17ఏళ్ల ప్రయాణానం ముగించాల్సి వచ్చింది.
ఎయిర్ డెక్కన్
భారతీయులకు కేవలం రూపాయి లేదా అంతకంటే తక్కువ ఖర్చుతో విమాన ప్రయాణం చేసే అవకాశం కల్పిస్తానని చెప్పిన జి.ఆర్.గోపీనాథ్ ఎయిర్ డెక్కన్ సంస్థను స్థాపించారు. 1997లో చార్టర్డ్ ఎయిర్ క్రాఫ్ట్ కంపెనీగా సంస్థ కార్యకలాపాలను ప్రారంభించింది. మొదట హెలికాప్టర్లను లీజుకు తీసుకుని 2003లో సర్వీసులను మొదలు పెట్టింది. రోజుకు 226 విమానాలను నడుపుతూ, 52 విమానాశ్రయాలను తమ నెట్ వర్క్ ను విస్తరించిన ఎయిర్ డెక్కన్. ఈ క్రమంలో 2007లో కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్.. ఎయిర్ డెక్కన్ లో 23 శాతం వాటాను కొనుగోలు చేసి.. బ్రాండ్ సింప్లిఫై డెక్కన్ గా పేరు మార్చింది. 2008లో మళ్లీ రీబ్రాండ్ చేసి..సింప్లిఫై డెక్కన్ ను కింగ్ ఫిషర్ లో విలీనం చేశారు. అయితే, అప్పటికే కష్టాలు మొదలైన కష్టాలు తగ్గలేదు. కొవిడ్ కారణంగా 2020 ఎయిర్ లైన్ ను మూసివేస్తున్నట్లు కంపెనీ సీఈవో అరుణ్ కుమార్ ప్రకటించారు.
పారామౌంట్ ఎయిర్ వేస్
సరసమైన ధరలకే బిజినెస్ క్లాస్ సర్వీసులను అందించే లక్ష్యంతో 2005లో పారామౌంట్ ఎయిర్ వేస్ ప్రారంభమైంది. న్యూ జనరేషన్ ఎంబ్రేయర్ 170/190 సిరీస్ ఫ్లైట్లను భారత్ లో ప్రవేశపెట్టి తొలి విమానయాన సంస్థగా పారామౌంట్ నిలిచింది. లగ్జరీ విమానాలను లీజుకు తీసుకున్న సంస్థ లీజు చెల్లింపులపై డిఫాల్ట్ లు, వివాదాలతో లీగల్ కేసులకు దారితీశాయి. బ్యాంకుల కన్సార్షియానికి ఆ కంపెనీ రూ.400 కోట్లకు పైగా బకాయిపడింది. వీటి కారణంగా లీజు కంపేనీలు పారామౌంట్ విమానాలను స్వాధీనం చేసుకునే పరిస్థితి ఏర్పడింది. దీంతో 2010 పారామౌంట్ ఎయిర్ వేస్ తన సర్వీసులను నిలిపివేసింది.
Read Also: నేషనల్ హైవేపై వంట చేసిన దంపతులు.. వీడియో చూస్తే అవాక్కే!
Follw Us On: Youtube


