epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

ఆర్​ఎస్​ఎస్​, బీజేపీ గుప్పిట్లో ఈసీ : రాహుల్​ గాంధీ ​

కలం, వెబ్​డెస్క్​: ఎన్నికల కమిషన్​ను ఆర్​ఎస్​ఎస్​, బీజేపీ గుప్పిట్లో పెట్టుకున్నాయని లోక్​సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్​ నాయకుడు రాహుల్​ గాంధీ(Rahul) తీవ్ర విమర్శలు చేశారు. ప్రధాన ఎన్నికల కమిషన్​(సీఈసీ) ఏ తప్పు చేసినా తప్పించుకునేలా ఎన్​డీఏ ప్రభుత్వం చట్టంలో మార్పు చేసిందన్నారు. తాము అధికారంలోకి వచ్చాక ఈసీని బలోపేతం చేసే చట్టాలు చేస్తామని, ఇప్పుడు తప్పు చేసినవాళ్లను వదిలిపెట్టబోమని హెచ్చరించారు. ఎన్నికల సంస్కరణ (Election Reforms) పై మంగళవారం లోక్​సభ చర్చలో రాహుల్​ గాంధీ మాట్లాడారు.

భారత ప్రజాస్వామ్యం ఓట్లే మూలస్తంభమని, వందకోట్ల భారతీయుల ఓట్ల కారణంగానే పంచాయతీల నుంచి విధానసభలు, రాజ్యసభ, లోక్​సభ వరకు మనుగడ సాగిస్తున్నాయని చెప్పారు. మన దేశం సాధించిన ఎన్నో ఘనతల వెనక ఉన్నది ఓటు మాత్రమేనన్నారు. అయితే, బీజేపీ, ఆర్​ఎస్​ఎస్​ ఎన్నికల కమిషన్​ను గుప్పిట్లో పెట్టుకుందని పేర్కొన్నారు. దేశంలోని ప్రతి వ్యవస్థను తమ ఆధీనంలోకి తీసుకుంటున్నాయని, ఈడీ, ఐటీ, సీబీఐ, ఎన్​ఐఏ వంటివీ ఇందులో ఉన్నాయన్నారు. ఎలక్షన్​ కమిషనర్​ ఎంపికపై ప్రధాని మోదీకి, హోంమినిస్టర్​ అమిత్​ షా కు ఎందుకు అంత ఆసక్తి అని ప్రశ్నించారు.

‘ఓట్​ చోరీ’ అతి పెద్ద దేశ వ్యతిరేక చర్య అని మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసేందుకే ఎన్నికల కమిషన్​ను వాడుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సంఘం స్వయం ప్రతిపత్తి ఎందుకు బలహీనమవుతోంది? దాని స్వతంత్రను కాపాడే యంత్రాంగాలను పునరుద్ధరిస్తారా? అనేక రాష్ట్రాల నుంచి ‘సర్​’పై ఫిర్యాదులు వస్తున్నాయి.. ఓటర్ల జాబితా తారుమారు చేయకుండా ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఈసీ నియామకాలు, నిర్ణయాలు రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా ఎందుకు ఉంటున్నాయి? పారదర్శక సంస్కరణలు చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందా? అని కేంద్రానికి ప్రశ్నలు సంధించారు.

కాగా, రాహుల్​(Rahul) మాట్లాడుతుండగా ఎన్​డీఏ కూటమి సభ్యులు పదే పదే అంతరాయం కలిగించారు. తాను ఆర్​ఎస్​ఎస్​ నుంచి వచ్చానని చెప్పేందుకు గర్వపడుతున్నానన్న బీజేపీ ఎంపీ నిషికాంత్​ దూబే.. ముస్లింల కోసం నెహ్రూ నుంచి ఇప్పటివరకు కాంగ్రెస్​ విలువలతో కాంప్రమైజ్​ అయ్యిందని విమర్శించారు. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్​ రామ్​ మేఘవాల్​ దేశంలో ‘సర్​’ నిర్వహించడం ఇదే మొదటిసారి కాదన్నారు. కాగా, చర్చ ఓటరు జాబితా సమగ్ర సవరణ(సర్​) కాకుండా ఎన్నికల సంస్కరణల (Election reforms) పైనే కొనసాగింది.

Read Also: భారత్‌లో మూతపడ్డ విమాన సంస్థలు.. కారణాలేంటి?

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>