కలం, వెబ్‌డెస్క్: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ (Telangana Rising Global Summit) రెండో రోజూ పెట్టుబడులతో కళకళలాడింది. ఫ్యూచర్ సిటీ వేదికగా ఈ ప్రతిష్టాత్మక సదస్సులో మొదటి రోజు సోమవారం దాదాపు రూ.2.43లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదరగా, రెండో రోజైన మంగళవారం సాయంత్రం నాటికి మరో రూ.2,96,495 కోట్లకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, అధికారుల సమక్షంలో ఎంవోయూలు జరిగాయి. అంటే మొత్తం రూ.5,39,495కోట్ల మేర పెట్టుబడులు రానున్నాయి.
అలాగే ప్రత్యక్షంగా, పరోక్షంగా వేల మందికి ఉద్యోగ, ఉపాధి లభిస్తుంది. ఈ మేరకు వివిధ దేశీ, విదేశీ కంపెనీల ప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వంతో ఒడంబడిక కుదుర్చుకున్నారు. మంగళవారం ఎంవోయూల్లో ఇన్ఫ్రాకీ డీసీ పార్క్స్ సంస్థ ఒక్కటే రూ.70వేల కోట్ల మేర ఒప్పందం కుదుర్చుకుంది. ఫ్యూచర్ సిటీ (Future City)లో 150 ఎకరాల్లో డేటా సెంటర్‌తోపాటు ఏఐ ఆధారిత 1గిగావాట్ డేటా పార్క్ ఈ కంపెనీ ఏర్పాటుచేయనుంది. జేసీకే ఇన్ఫ్రా ప్రాజెక్ట్ లిమిటెడ్ రూ.9వేల కోట్లతో డేటా సెంటర్, అనుబంధ సౌకర్యాలు కల్పించనుంది. ఫార్మా, మెడికల్, గ్రీన్ ఎనర్జీ, ఫుడ్ అండ్ అగ్రికల్చర్, బేవరేజెస్, ఐటీ, స్పోర్ట్స్, టూరిజం, ఫారెస్ట్ వంటి వివిధ విభాగాల్లో కంపెనీలు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ (Telangana Rising Global Summit) లో మరికొన్ని కంపెనీల పెట్టుబడులు ఇవీ..
- ఏజీపీ గ్రూప్ – రూ.6,750కోట్లు
- బయోలాజికల్ ఇ లిమిటెడ్ – రూ.3,500కోట్లు.
- ఆర్సీటీ ఎనర్జీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ – రూ.2,500కోట్లు.
- ఫెర్టిస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ – రూ.2,000 వేల కోట్లు.
- అరబిందో ఫార్మా – రూ.2,000కోట్లు
- హెటెరో గ్రూప్ – రూ.1,800కోట్లు
- రిలయన్స్ కన్జూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ (ఆర్పీసీఎల్)–రూ.1,500కోట్లు
- గ్రాన్యుల్స్ ఇండియా – రూ.1,200కోట్లు
- వింటేజ్ కాఫీ అండ్ బేవరేజెస్ లిమిటెడ్ – రూ.1,100కోట్లు
- కేన్స్ టెక్నాలజీ ఇండియా లిమిటెడ్ – రూ.1,000కోట్లు
- భారత్ బయోటెక్ – రూ.1000కోట్లు
- కేజేఎస్ ఇండియా – రూ.650కోట్లు
- గోద్రెజ్ ఇండస్ట్రీస్ గ్రూప్ – రూ.150కోట్లు
వీటితోపాటు అఖిలాన్ నెక్సస్ లిమిటెడ్, ప్యూర్‌వ్యూ గ్రూప్, అనలాగ్ ఏఐ(అలెక్స్ కిప్మన్), అల్ట్‌మిన్, అజయ్ దేవ్‌గణ్ ఫిల్మ్ స్టూడియో, జూరిచ్ ఇన్సూరెన్స్, కెనడియన్ ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, మాక్సిమస్ (యూఎస్ఎ), టీడబ్ల్యూఐ గ్రూప్, మహీంద్ర అండ్ మహీంద్ర, జీఎంఆర్ స్పోర్ట్స్ వెంచర్ ప్రైవేట్ లిమిటెడ్, ఇండియా ఎక్స్ట్రీమ్ అడ్వెంచర్ యాక్టివిటీస్ ప్రైవేట్ లిమిటెడ్, బ్లాక్‌స్టోన్ ఏసియా, సత్వా గ్రూప్, బ్రిగేడ్ గ్రూప్, సుమధుర గ్రూప్, బయోవరం, విజ్జీ హోల్డింగ్స్ తదితరం కంపెనీలు ఎంవోయూలు చేసుకున్నాయి.
క్రీడలకు సంబంధించి తెలంగాణ ఫిఫా–ఎఐఎఫ్ఎఫ్ ఆధ్వర్యంలో ఫుట్‌బాల్ అభివృద్దికి పలు కార్యక్రమాలు చేపడతారు. అలాగే మహిళల హాకీ వరల్డ్ కప్ క్వాలిఫయర్స్ నిర్వహణకు, ఆసియ రోయింగ్ చాంపియన్‌షిప్ 2026, హైదరాబాద్ ఇంటర్నేషనల్ చెస్ ఫెస్టివల్ 2026కు తెలంగాణ ఆతిథ్యం ఇవ్వడం వంటివి ఉన్నాయి.
Read Also: సౌదీలో ముస్లిమేతరులకు మద్యం
Follw Us On: Youtube


