కలం, వెబ్ డెస్క్: చూస్తుంటే రాజమౌళి (Rajamouli) ఇప్పట్లో మీడియా ముందకు గానీ, కెమెరాల ముందుకు గానీ వచ్చేలా కనిపించట్లేదు. వారణాసి ఈవెంట్ లో హనుమంతుడిపై కామెంట్లు పెద్ద వివాదం అయ్యాయి. ఆ వివాదంపై క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసినా, కేసులు పెట్టినా రాజమౌళి రెస్పాండ్ కాలేదు. జపాన్ లో బాహుబలి ది ఎపిక్ ప్రమోషన్ల కోసం ప్రభాస్(Prabhas) ఒక్కడే వెళ్లాడు. వాస్తవానికి వేరే దేశాల్లో ప్రమోషన్లు ఉంటే కచ్చితంగా రాజమౌళి వెళ్లి అన్నీ చూసుకుంటాడు. ఆయనకు వరల్డ్ వైడ్ గా గుర్తింపు ఉంది. అలాంటి జక్కన్న ఇప్పుడు వెళ్లలేదు అంటే బయటకు రావొద్దనే నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.
ఎందుకంటే వారణాసి(Varanasi) వివాదం జరిగి కొన్ని రోజులే అవుతోంది. కాబట్టి ఇప్పుడే బయటకు వచ్చి ఈవెంట్లలో కనిపిస్తే మళ్లీ విమర్శలు తప్పవనే కారణంతో రాజమౌళి (Rajamouli) సైలెంట్ గా తన పని తాను చేసుకుపోవాలని డిసైడ్ అయ్యాడంట. వారణాసి మూవీలో హనుమంతుడు, రాముడి మీద ఎపిసోడ్స్ ఉన్నాయి. కాబట్టి వాటిని పవర్ ఫుల్ గా తీసి పోస్టర్ లేదా టీజర్ లాంటిది వదిలితే అప్పుడు తన మీద ఉన్న నెగెటివిటీ తగ్గుద్దనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. ఆ తర్వాత తాను బయటకు వచ్చి దేవుళ్ల సీన్ల గురించి మాట్లాడితే ఎలాంటి వివాదం ఉండదని భావిస్తున్నాడంట. కాబట్టి అప్పటి దాకా వేరే సినిమాల ఈవెంట్లకు గానీ, ఇతర ప్రోగ్రామ్ లలో గానీ కనిపించకపోవచ్చు అంటున్నారు సినిమా నిపుణులు.
Read Also: అదిరిపోయే కొత్త ఫీచర్ తీసుకొచ్చిన శాంసంగ్
Follw Us On: Youtube


