కలం, వెబ్ డెస్క్: స్మార్ట్ ఫోన్ యూజర్లకు స్టోరేజ్ అతిపెద్ద సమస్య స్టోరేజ్. ఎంత ఎక్కువ స్టోరేజీ ఉన్న మొబైల్ తీసుకున్నా కొద్ది రోజుల్లోనే మెమరీ ఫుల్ అయిపోతూ ఉంటుంది. దీంతో పాత డాటాను డిలిట్ చేయడం లేదంటే వేరే డివైజ్‌లలోకి ట్రాన్స్ ఫర్ చేయాల్సి వస్తోంది. ఇప్పుడు అటువంటి సమస్యకు చెక్ పెడుతూ శాంసంగ్ కొత్త టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. యూఐ 8.5 బీటావెర్షన్‌ను (Samsung One UI 8.5 Beta India) అధికారికంగా భారత్‌లో విడుదల చేసింది.
ప్రైవసీ, ప్రొడక్టివిటీని మరింత మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ కొత్త వెర్షన్ తీసుకొచ్చినట్టు చెప్పింది. ఈ అప్‌డేట్‌లో అతి ముఖ్యమైన కొత్త ఫీచర్ ‘స్టోరేజ్ షేర్’. ఒక వేళ మొబైల్‌లో స్టోరేజీ నిండిపోతే భయపడాల్సిన అవసరం లేదు. పాత డాటాను డిలిట్ చేయాల్సిన్ అవసరం లేదు. పక్కన ఉన్న మీ ఇతర గెలాక్సీ డివైస్‌లు (ట్యాబ్లెట్, ల్యాప్‌టాప్, మరో ఫోన్) స్టోరేజ్‌ను ‘మై ఫైల్స్’ యాప్ ద్వారా నేరుగా యాక్సెస్ చేసుకోవచ్చు. ఫైల్స్ చూడటం, కాపీ చేయడం, షేర్ చేయడం అంతా ఈజీగా ఉంటుంది.
కొత్త ఫీచర్లు ఏమిటి?
ఫోటో అసిస్ట్ ఫీచర్‌ను కూడా అప్‌గ్రేడ్ చేశారు. దీనివల్ల యూజర్లు ప్రతి సారి చేసిన చేంజెస్‌ను విడిగా సేవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఫోటోలను వరుసగా ఎడిట్ చేసుకోవచ్చు. దీంతో క్రియేటివ్ వర్క్‌ఫ్లో ఎటువంటి అంతరాయం లేకుండా కొనసాగుతుంది. అలాగే ఈ ఫీచర్ మొత్తం ఎడిట్ హిస్టరీని చూసే అవకాశం ఇస్తుంది. అందులో మనకు నచ్చిన వెర్షన్ లేదా బెస్ట్ రిజల్ట్‌ను ఎంపిక చేసుకోవచ్చు. ఆడియో బ్రాడ్‌కాస్ట్, ఎల్‌ఈ ఆడియో , Auracast టెక్నాలజీతో పక్కనున్న డివైస్‌లకు ఆడియో షేర్ చేయవచ్చు. ఫోన్ చోరీ అయినా, పాస్‌వర్డ్ తప్పుగా ఎంటర్ చేసినా ఆటోమాటిక్‌గా డివైజ్ లాక్ అయిపోతుంది. ఫెయిల్డ్ ఆథెంటికేషన్ లాక్ వంటి కొత్త సెక్యూరిటీ ఫీచర్లు అందుబాటులోకి వచ్చాయి.
ఏ ఫోన్లలో అందుబాటులో ఉంటాయి?
ప్రస్తుతం లాక్సీ ఎస్25 సిరీస్ (ఎస్25, ఎస్25 ప్లస్, ఎస్25 అల్ట్రా) యూజర్లకు మాత్రమే ఈ బీటా (Samsung One UI 8.5 Beta India) అందుబాటులో ఉంది. గెలాక్సీ ఎస్25 ఎఫ్ఈ, మరియు ఎస్ 25 ఎడ్జ్ మోడల్స్‌కు ఇంకా రాలేదు. సామ్‌సంగ్ మెంబర్స్ యాప్ ఓపెన్ చేసి, వన్ యూఐ 8.5 బీటా ప్రోగ్రామ్‌లో రిజిస్టర్ చేసుకోవాలి. ఆ తర్వాత సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ సెక్షన్‌లో చూస్తే అప్‌డేట్ వస్తుంది. ఇండియాతో పాటు జర్మనీ, యూకే, అమెరికా, సౌత్ కొరియా, పోలాండ్ దేశాల్లోనూ ఈ బీటా ప్రోగ్రామ్ అందుబాటులో ఉంది. త్వరలోనే స్టేబుల్ వెర్షన్ అందరికీ అందుబాటులోకి రానున్నది.
Read Also: భారత్‌లో మూతపడ్డ విమాన సంస్థలు.. కారణాలేంటి?
Follow Us On: Instagram


