జపాన్ లో మళ్లీ భూకంపం కలకలం రేపింది. జపాన్(Japan) లోని ఉత్తర తీరంలో వచ్చిన భూకంపంతో చాలా ఇండ్లు, పెద్ద బిల్డింగులు కంపించాయి. ఈ ప్రమాదంతో ప్రభాస్(Prabhas) గురించే చర్చలు మొదలయ్యాయి. ఎందుకంటే ప్రభాస్ ప్రస్తుతం బాహుబలి ది ఎపిక్ ప్రమోషన్ల కోసం జపాన్ వెళ్లాడు. ప్రభాస్ సేఫ్టీపై ఆరా తీస్తున్న ఫ్యాన్స్ కు డైరెక్టర్ మారుతి క్లారిటీ ఇచ్చారు. ప్రభాస్ క్షేమంగానే ఉన్నారని తెలిపాడు మారుతి. ‘ప్రభాస్ తో మాట్లాడాను. భూంకంపం వచ్చిన ఏరియాలో ఆయన లేరు. ఫ్యాన్స్ టెన్షన్ పడకండి’ అంటూ తెలిపాడు మారుతి. డిసెంబర్ 12న జపాన్ లో బాహుబలి ది ఎపిక్ మూవీ రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా అక్కడి అభిమానులను కలుస్తున్నారు హీరో ప్రభాస్.
Read Also: జానీ మాస్టర్ భార్య సుమలత ఘన విజయం
Follow Us On: X(Twitter)


