కలం, వెబ్ డెస్క్: తెలంగాణ ఫిల్మ్ అండ్ టీవీ డాన్సర్స్ అండ్ డాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ (TFTDDA) ఎన్నికలు డిసెంబర్ 7న జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ (Johnny Master) భార్య సుమలత (Sumalatha) అధ్యక్షురాలిగా ఘన విజయం సాధించారు. ప్రత్యర్థి జోసెఫ్ ప్రకాష్ మీద 29 ఓట్ల మెజార్టీతో సుమలత గెలుపొందారు. ఈ విజయం సుమలతకు మాత్రమే కాకుండా, జానీ మాస్టర్ ఫ్యామిలీకి ఒక పెద్ద ఆశ్వాసం అయింది.
గతంలో జానీ మాస్టర్ TFTDDA అధ్యక్షుడిగా కొనసాగారు. కానీ, తనని జానీ మాస్టర్ (Johnny Master) వేధించాడంటూ అతని అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ స్రష్టి వర్మ ఆరోపణలు చేయడంతో.. సభ్యులు ఆయన్ను పదవి నుంచి తప్పించారు. 2023లో జానీ మాస్టర్ అధ్యక్షుడిగా ఎన్నికైనప్పటికీ, ఈ ఆరోపణలు పెరిగి ఆయనకు తీవ్ర ఒత్తిడి కలిగించాయి. జానీ మాస్టర్ ఆ ఆరోపణలు ఖండిస్తూ… “ఎన్నికలు రావడంతో పరిస్థితులు మారతాయి” అని చెప్పుకుని, తన భార్య సుమలతను అధ్యక్ష పదవికి పోటీపై నిలబెట్టారు. ఫలితంగా, సుమలత గెలిచి మళ్లీ అసోసియేషన్‌లో పట్టు సంపాదించుకున్నారు.


