కలం, వెబ్‌డెస్క్: అమెరికాలో నివసిస్తున్న ఇతర దేశాల ప్రజలకు, పర్యాటకులకు ఎఫ్‌బీఐ స్కామ్ అలర్ట్ జారీ చేసింది. ‘మీ కుటుంబసభ్యులు, బంధువులు, సన్నిహితులను కిడ్నాప్ చేశామం’టూ సైబర్ నేరగాళ్లు కొత్త దందాకు తెరతీశారని, వాటి నుంచి తప్పించుకోవాలంటే మీవాళ్లకు ప్రత్యేక కోడ్లు పెట్టుకోవాలంటూ సూచించింది. కాగా, ఇటీవల అమెరికాలో ఈ తరహా వర్చువల్ కిడ్నాపింగ్(Virtual Kidnapping) కేసులు ఎక్కువవుతుండడంతో ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(ఎఫ్‌బీఐ) ఈ వార్నింగ్ ఇచ్చింది. కిడ్నాపర్లు సోషల్ మీడియా ఖాతాల్లో ఫొటోలు, వీడియోలను తీసుకొని వాటిని మార్ఫింగ్ మీ వాళ్లను కిడ్నాప్ చేశామని కాల్ చేస్తారని, వాటి బారి నుంచి తప్పించుకోవాలంటే మీకు, మీవాళ్లకు మాత్రమే తెలిసేలా కొన్ని ప్రత్యేక పదాలను కోడ్‌గా పెట్టుకోవాలని పేర్కొంది. కిడ్నాపర్లు కాల్ చేసినప్పుడు మీవాళ్ల నుంచి ఆ కోడ్ తెలుసుకొని చెప్పాలని అడగాలని సూచించింది. వాళ్లు చెప్పకపోతే అది స్కామ్‌గా గుర్తించి, పోలీసులకు ఫిర్యాదు చేయాలని చెప్పింది. డబ్బు కోసం కిడ్నాపర్లు ఒత్తిడి చేస్తారని, ఆలోచించే టైమ్ ఇవ్వరని, దాన్ని గుర్తుపెట్టుకొని వర్చువల్ కిడ్నాపింగ్(Virtual Kidnapping)పై జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించింది.
Read Also: బాలయ్య ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. అఖండ 2 రిలీజ్ డేట్ ఫిక్స్
Follow Us On: Instagram


