కలం, వరంగల్ బ్యూరో: కుటుంబాల్లో సర్పంచ్ ఎన్నికలు (Sarpanch Elections) చిచ్చు పెడుతున్నాయి. రక్తం సంబంధీకులే ఒకరి మీద ఒకరు పోటీ పడుతున్నారు. సర్పంచ్ పదవి కోసం అయిన వాళ్లు దూరం అవుతున్నారు. సర్పంచ్, వార్డ్ సభ్యుల పదవులు ఆశిస్తున్న వాళ్లు రక్త సంబంధాలు కూడా మరిచి పోతున్నారు. పదువులు వస్తే చాలు ఆ తర్వాతే ఏదైనా అంటున్నారు. ఒకే కుటుంబానికి చెందిన వారు ఆయా గ్రామ సర్పంచ్ పదవి కోసం పోటీ పడుతుండడంతో పంచాయతీ ఎన్నికలు రసవత్తరంగా మారాయి.
పంచాయతీ లొల్లి..
కొన్ని గ్రామాల్లో సర్పంచ్ ఎన్నికలు (Sarpanch Elections) సామారస్యంగా కొనసాగుతుండగా.. కొన్నిచోట్ల ఢీ అంటే ఢీ అనే వాతావరణం నెలకొంది. మరి కొన్ని ప్రాంతాల్లో గమనిస్తే ఒకే కుటుంబం నుంచి ఇద్దరేసి చొప్పున సర్పంచ్, వార్డ్ పదవుల కోసం పోటీ పడుతున్న తీర్చు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఆయా పార్టీల పెద్దలు రాజీ ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అభ్యర్థులు తగ్గేదేలే అన్నట్లు మొండి వైఖరి అవలంభిస్తున్నారు. దీంతో ఆయా కుటుంబాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంటోంది.
కుటుంబ సభ్యుల మధ్య పోటీ
ఒకే కుటుంబానికి చెందిన వారు బరిలో ఉండండంతో విజయ లక్ష్మి ఎవరిని వరిస్తోందోననే చర్చ నడుస్తోంది. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం, కట్ర్యాల సర్పంచ్ ఎన్నికల్లో సుల్తాన్ పోశమ్మ, రాయపురం రమ్య తల పడుతున్నారు. కాంగ్రెస్ నుంచి పోటీలో ఉన్న పోశమ్మకు , బీజేపీ నుంచి పోటీ లో ఉన్న రమ్య సొంత మనుమరాలు (కూతురి కూతురు) అవుతుంది. గ్రామ పెద్దల మద్దతుతో అమ్మమ్మ, యువత మద్దతుతో మనవరాలు పోటీపడుతున్నారు. అదేవిధంగా బయ్యారం మండలం వెంకటాపురం గ్రామ సర్పంచ్ పదవి కోసం అన్నాచెల్లెలు పోటీ పడుతున్నారు. కాంగ్రెస్ నుంచి బొర్ర కృష్ణ బరిలో ఉండగా అతడి తోబుట్టువు పొడుగు సుగుణ బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ గ్రామంలో అన్న గెలుస్తుందా చెల్లెలు గెలుస్తుందా అనే చర్చ నడుస్తోంది.
Read Also: అదిరిపోయే కొత్త ఫీచర్ తీసుకొచ్చిన శాంసంగ్
Follow Us On: Youtube


