కలం డెస్క్ : Government Holidays | వచ్చే సంవత్సరం సెలవు దినాలను (Holidays) రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. జనవరి మొదలు డిసెంబరు వరకు మొత్తం 27 జనరల్ హాలీడేస్ ఉంటాయని, వీటికి తోడు 26 ఆప్షనల్ హాలీడేస్ కూడా ఉంటాయని పేర్కొన్నది. జనరల్ హాలీడేస్‌లో మొత్తం ఐదు ఆదివారం రోజునే వచ్చాయి. మహాశివరాత్రి (ఫిబ్రవరి 15), రంజాన్ మరుసటి రోజు (మార్చి 22), బాబూ జగ్జీవన్‌రామ్ జయంతి (ఏప్రిల్ 5), సద్దుల బతుకమ్మ (అక్టోబర్ 18), దీపావళి (నవంబరు 8) ఆదివారం రోజునే వచ్చాయి.
Government Holidays | ఇవి కాక న్యూ ఇయర్, కనుమ, మహావీర్ జయంతి, శ్రీపంచమి, బుద్ధపూర్ణిమ, తమిళ సంవత్సరాది, వరలక్ష్మీ వ్రతం, నరక చతుర్దశి, పార్శీ సంవత్సరాది, మొహర్రం, హజరత్ మొహమ్మద్ జయంతి, క్రిస్మస్ ముందు రోజు.. ఇలాంటి 26 ఆప్షనల్ హాలీడేస్ జాబితాను కూడా ప్రభుత్వం ప్రకటించింది. విద్యా సంస్థలు, పబ్లిక్ వర్క్స్ డిపార్టుమెంటు తదితరాలకు ఆప్షనల్ హాలీడేస్ అదే రోజున తీసుకోవడంలో ఉన్న ఇబ్బందుల దృష్ట్యా వేరుగా ఆయా డిపార్టుమెంట్లు జాబితాలను ప్రకటించనున్నాయి. రంజాన్, బక్రీద్, మిలాదున్ నబి తదితర కొన్ని ముస్లిం పండుగలు చంద్రుని దర్శనంతో ముడిపడి ఉన్నందున అప్పటి పరిస్థితుల ప్రకారం తేదీలు మారవచ్చని, ఆ ప్రకారం సంబంధిత డిపార్టుమెంట్లు, జిల్లా ప్రభుత్వ యంత్రాంగం నిర్ణయం తీసుకుని ప్రకటిస్తాయని తాజా ప్రకటనలో సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ-GAD) పేర్కొన్నది.
Read Also: కవిత నోట ‘బీటీ బ్యాచ్’ మాట
Follow Us On: Instagram


