epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

గ్రామస్తుల మేనిఫెస్టో.. తెలంగాణ డల్లాస్‌గా అంకాపూర్

కలం, వెబ్ డెస్క్: తెలంగాణ స్థానిక ఎన్నికల్లో సర్పంచ్ పదవుల కోసం అభ్యర్థులు తీవ్ర పోటీని ఎదుర్కొంటున్న వేళ.. నిజామాబాద్ జిల్లాలోని అంకాపూర్(Ankapur) గ్రామం ప్రత్యేకంగా నిలుస్తోంది. రాజకీయాలకతీతంగా ఆ గ్రామం అభివృద్ధిలో దూసుకుపోతోంది. ఇక్కడ సర్పంచ్ పాత్ర కేవలం పరిపాలనాపరమైనది కాదు. పదేండ్ల ముందుచూపుతో గ్రామాభివృద్ధికి కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. అందుకే రాష్ట్రంలోనే ఆదర్శవంతమైన గ్రామాల్లో ఒకటిగా పేరు తెచ్చుకుంది. అంకాపూర్ గ్రామస్తుల సమాచారం ప్రకారం.. ఈసారి నలుగురు బరిలో నిలిచారు. గంగారాం, ఎన్ రమణారెడ్డి, పి నవీన్, ఎ దేవేందర్ పోటీ చేసే అవకాశం ఉంది. ఈ సందర్భంగా గ్రామ పెద్ద కె.కె. బజన్న మాట్లాడుతూ.. సర్పంచ్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకోలేరని, గ్రామ సమాజానిదే తుది నిర్ణయమన్నారు. అంకాపూర్ అభివృద్ధికి నిధులు కమ్యూనిటీ విరాళాలు, గ్రామ అభివృద్ధి కార్పొరేషన్ (VDC) ద్వారా అందుతాయి. కాబట్టి భవిష్యత్ అవసరాల కోసం సర్పంచ్ కలిసి పనిచేయాలి.

“సర్పంచ్ ఎవరైనా రెండు, మూడు సంవత్సరాల గురించి మాత్రమే ఆలోచించకూడదు. సర్పంచ్ అంటే 2035లో అంకాపూర్(Ankapur) ఎలా ఉంటుందో ఊహించగల వ్యక్తి అయి ఉండాలి” అని అంకాపూర్ VDC అధ్యక్షుడు కె. గంగా రెడ్డి అన్నారు. మరోవైపు అంకాపూర్‌ ప్రత్యేకత ఏంటంటే.. పోలీసులపై దాదాపుగా ఆధారపడకపోవడం. చిన్న అభిప్రాయభేదాలు వచ్చిన పెద్దల జోక్యంతో పరిష్కారమవుతాయి. ఎవరైనా పోలీస్ స్టేషన్‌కు వెళ్ళినప్పుడు వెనక్కి పంపి పెద్దల సమక్షంలో సమస్యను పరిష్కరించుకోవాలని సూచిస్తారు పోలీసులు.

అంకాపూర్ తన ప్రత్యేక గుర్తింపును మరింత పెంచుకుంటూ ‘మినీ అమెరికా’గా పేరొందింది. ప్రతి నాలుగు కుటుంబాలలో ఒక కుటుంబం అమెరికాలో స్థిరపడినవారు ఉన్నారు. ఈ ట్రెండ్ దాదాపు రెండు దశాబ్దాల క్రితం ప్రారంభమైంది. సుమారు 1,200 కుటుంబాల్లో దాదాపు 400 కుటుంబాలు అమెరికాలో నివసిస్తున్నాయి. స్థానిక సంస్థల సమయంలో అంకాపూర్ మరోసారి వార్తల్లో నిలిచింది.

Read Also: ఏకగ్రీవ ఎన్నికలపై కొత్త ట్విస్ట్

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>