Mobile Popup Ad
Mobile Popup Ad

అహ్మదాబాద్‌లో రన్ ఫెస్ట్.. జీటీ, ఆర్‌ఆర్ మధ్య గట్టి పోరు

కలం, వెబ్ డెస్క్ : అహ్మదాబాద్(Ahmedabad) మైదానం సిద్ధంగా అయింది.. ప్రేక్షకులు ఉత్సాహంతో కదలాడుతున్నారు. ఇప్పుడు అసలు యుద్ధానికి రంగం సిద్ధం అయింది. ఐపీఎల్ 2026 (IPL 2026)లో గుజరాత్  టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరగబోయే పోరు కేవలం మ్యాచ్ కాదు..  ఇది ఆత్మగౌరవం, స్ట్రాటజీ, మైండ్ గేమ్‌ల సమ్మేళనం. పంజాబ్ చేతిలో ఓటమితో టోర్నీ ప్రారంభించిన గుజరాత్ టైటాన్స్, ఇప్పుడు ఆర్ఆర్‌పై గెలిచి తిరిగి ట్రాక్‌లోకి రావాలని చూస్తోంది.  కెప్టెన్ శుభమన్ గిల్  నేతృత్వంలో జట్టు మరింత ఫోకస్‌తో కనిపిస్తోంది. ఈ మ్యాచ్‌ను చాలా సీరియస్‌గా తీసుకుంది. మరోవైపు చెన్నైపై గెలిచిన రాజస్థాన్ రాయల్స్ పూర్తి ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోంది. రియాన్ పరాగ్ నాయకత్వంలో జట్టు ఉత్సాహంగా కనిపిస్తోంది. ఈ మ్యాచ్ అసలు కథ అంతా పిచ్ మీదే తిరుగుతుంది. అహ్మదాబాద్ పిచ్ అంటే బ్యాటర్లకు పండుగలా ఉంటుంది. బంతి సాఫ్ట్‌గా బ్యాట్‌పైకి వస్తుంది. ఒక్కసారి సెటిల్ అయితే బౌండరీలు వరుసగా పడే అవకాశం ఉంటుంది.

కానీ చిన్న ట్విస్ట్ ఉంది… ఇక్కడ ముందుగా బ్యాటింగ్ చేసిన జట్లకే ఎక్కువ విజయాలు వచ్చాయి. కాబట్టి టాస్ కూడా కీలకం. జట్ల బలం చూస్తే గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) బాగా బ్యాలెన్స్‌గా ఉంది. టాప్ ఆర్డర్ స్టేబుల్‌గా ఉంది. మిడిల్ ఆర్డర్ ఫినిషింగ్ ఇవ్వగలదు. బౌలింగ్‌లో అనుభవం కనిపిస్తుంది. ముఖ్యంగా రషీద్ ఖాన్ లాంటి ప్లేయర్ మ్యాచ్‌ను ఒక్కసారిగా మార్చగలడు. రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals) స్టైల్ మాత్రం అగ్రెసివ్. ఓపెనింగ్ నుంచే దాడి చేస్తుంది. యశస్వి జైస్వాల్ లాంటి బ్యాటర్ ఒక్కసారిగా ఫ్లోలోకి వస్తే బౌలర్లకు కష్టమే. మిడిల్ ఓవర్లలో స్పిన్‌తో ప్రెషర్ పెడుతుంది. డెత్ ఓవర్లలో పేస్ అటాక్‌తో కట్టడి చేయాలని చూస్తుంది.

హెడ్ టు హెడ్ రికార్డ్స్ గుజరాత్ వైపు ఉన్నాయి. ఎనిమిది మ్యాచ్‌లలో ఏకంగా ఆరు విజయాలు సాధించింది. ఇది కేవలం గణాంకం కాదు.. మెంటల్ అడ్వాంటేజ్ అని చెప్పవచ్చు. ముఖ్యంగా స్వదేశంలో గుజరాత్‌ను ఓడించడం సులభం కాదు. ఈ మ్యాచ్‌లో మూడు దశలు కీలకం… పవర్‌ప్లేలో ఎవరు దూకుడు చూపిస్తారు, మిడిల్ ఓవర్లలో ఎవరు కంట్రోల్ సాధిస్తారు, డెత్ ఓవర్లలో ఎవరు నర్వ్ నిలుపుకుంటారు. ఈ మూడు దశల్లో ఆధిపత్యం చూపిన జట్టుకే మ్యాచ్ గెలిచే అవకాశం ఉంది.

Read Also: ఎన్నికల్లో పోటీకి దూరం.. అన్నామలై క్లారిటీ !

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>