కలం, వెబ్డెస్క్: ప్రముఖ సినీనటుడు అక్కినేని నాగార్జున (Nagarjuna Akkineni) గ్లోబల్ సమ్మిట్లో(Telangana Global Summit) పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన విషయం తెలిసిందే. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కీలక ప్రకటన చేశారు. అన్నపూర్ణ స్టూడియోను ఫ్యూచర్ సిటీకి తీసుకొస్తామని అక్కినేని నాగార్జున ప్రకటించారు.
ఫ్యూచర్ సిటీలో (Future City) నిర్వహించిన తెలంగాణ గ్లోబల్ రైజింగ్ సమ్మిట్లో పాల్గొన్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. గ్లోబల్ సమ్మిట్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ ప్రభుత్వ విజన్ ఎంతో బాగుందని కొనియాడారు.
ఈ ప్రాంతంలో ఫిల్మ్ హబ్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోందని చెప్పారు. అజయ్ దేవ్గణ్ లాంటి వాళ్లు ఇక్కడ ఫిల్మ్ సిటీని ఏర్పాటు చేయాలనుకోవడం గొప్ప విషయమన్నారు. ‘ప్రభుత్వ విజన్ డాక్యుమెంట్ నేను చదివాను, చాలా అద్భుతంగా ఉంది.’ అంటూ నాగార్జున(Nagarjuna) పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం భవిష్యత్లో ఎంతో అభివృద్ధి చెందుతుందని ఆయన ఆకాంక్షించారు.
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ముందుచూపుతో వ్యవహరిస్తోందని పేర్కొన్నారు. ప్రభుత్వానికి సంకల్పం ఉంటే ఏదైనా సాధించగలుగుతుందని చెప్పారు.
Read Also: అవతార్ 3 అంచనాలను అందుకుంటుందా!
Follow Us On: Instagram


