కలం, వెబ్ డెస్క్: సుప్రీంకోర్టు (Supreme Court) కీలక ఆదేశాలు జారీ చేసింది. అన్ని రాష్ట్రాల బార్ కౌన్సిళ్లలో మహిళలకు 30 శాతం రిజర్వేషన్లు ఉండాల్సిందే అని ఆదేశించింది. రిజర్వేషన్ల అంశంపై ఈ నెల 4న దాఖలైన పిటిషన్‌ను అదే రోజు విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు సీజే నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం సోమవారం ఈ ఆదేశాలు ఇచ్చింది. చాలా బార్ కౌన్సిళ్లలో మహిళల ప్రాధాన్యత తక్కువగా ఉందనే వాదనలు మహిళా న్యాయవాదుల నుంచి వచ్చాయి. వీటిపై సుప్రీంకోర్టు ఈ విధంగా ఆదేశాలు జారీ చేసింది. ఆల్రెడీ బీహార్, ఛత్తీస్ ఘడ్ లో బార్ కౌన్సిల్ ఎన్నికలు అయిపోయాయి కాబట్టి వాటిని ఇప్పుడు మార్చలేమని.. రాబోయే మిగతా రాష్ట్రాల బార్ కౌన్సిల్ ఎన్నికల్లో వీటిని అమలు చేయాలని సూచించింది.
20 శాతం ఎన్నికల ద్వారా నియమిస్తే.. మిగతా 10 శాతం కో ఆప్షన్ ద్వారా నియమిస్తారని సుప్రీంకోర్టు (Supreme Court) తెలిపింది. అప్పుడు 30 శాతం మహిళా న్యాయవాదులకు రిజర్వేషన్ వర్తిస్తుందని.. ఇంట్లో ఉండిపోతున్న వారికి కాకుండా కోర్టుల్లో పనిచేస్తున్న వారికే ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపింది. పూర్తి వివరాలను సమర్పించాలని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాను సుప్రీం ఆదేశించింది.
Read Also: ఫ్యూచర్ సిటీకి అన్నపూర్ణ స్టూడియో
Follow Us On: Youtube


