epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

ఎయిర్​పోర్ట్ కు బాంబ్​ థ్రెట్​.. సమ్మిట్​పై ఎఫెక్ట్​

కలం, వెబ్​ డెస్క్​: అసలే ఐదు రోజుల నుంచి ఇండిగో సంక్షోభం.. ఆపై విమానాలకు వరుసగా బెదిరింపులు.. వెరసి తెలంగాణ ప్రభుత్వానికి ఆందోళన కలిగిస్తున్నాయి. నగరంలో తెలంగాణ గ్లోబల్​ సమ్మిట్​(Global Summit)ను ప్రతిష్టాత్మకత్మంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కార్య్రమానికి దేశ విదేశాల నుంచి ప్రముఖ వ్యాపారవేత్తలు, కంపెనీల ప్రతినిధులు,రాజకీయ నేతలు తరలిరానున్నారు. దీంతో ప్రభుత్వం పటిష్ట ఏర్పాట్లు చేసింది.అన్ని సౌకర్యాలూ కల్పిస్తోంది. ఈ క్రమంలో విమానాలకు బాంబు బెదిరింపు రావడం అధికారులను, ప్రభుత్వాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. సమ్మిట్​ పై ప్రభావం చూపుతుందని భయపడుతోంది.

నాలుగు రోజుల్లో ఆరు విమానాలకు..:

అసలే ఇండిగో సంక్షోభంతో దేశవ్యాప్తంగా విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం కలుగుతోంది.వందలాది ఫైట్ల రద్దుతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు.ఇదే సమయంలో విమానాలకు బాంబు బెదిరింపు మెయిల్స్​, కాల్స్​ రావడం కలవరం కలిగిస్తోంది.శంషాబాద్​ రాజీవ్​ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగించే విమానాలకు ఏకంగా నాలుగు రోజుల్లో మూడు సార్లు బాంబు బెదిరింపు కాల్స్​ వచ్చాయి. ఈ నెల 5న దుబాయ్​ – హైదరాబాద్​ ఎమిరేట్స్​ ఫ్లైట్​ కు మొదట బాంబు బెదిరింపు వచ్చింది. ఆ తర్వాత 6న బ్రిటిష్​ ఎయిర్​ వేస్​ ఫ్లైట్​, కువైట్​ ఎయిర్​ వేస్​ ఫ్లైట్​ కు బాంబు బెదిరింపులు వచ్చాయి. నేడు ఏకంగా మూడు విమానాలకు బాంబు బెదిరింపు వచ్చింది. కన్నూర్​ నుంచి హైదరాబాద్​కు వచ్చే ఇండిగో సర్వీస్​ తోపాటు హైదరాబాద్​–లండన్​ బ్రిటిష్​ ఎయిర్​ వేస్​, ఫ్రాంక్​ ఫర్ట్​ – హైదరాబాద్​ లుఫ్తాస్సా సర్వీస్​ లకు బాంబు థ్రెట్​ మెయిల్స్​ వచ్చాయి. దీంతో ఆ విమానాలు గంటల తరబడి తనిఖీకి నిలిచిపోయాయి.

ప్రభుత్వం అప్రమత్తం:

రాజధానిలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న గ్లోబల్​ సమ్మిట్(Global Summit)​ కు 44 దేశాల నుంచి 154 మంది ప్రముఖులు రానున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. వీరితోపాటు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి తరలిరానున్న వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకుల రాకపోకలకు కీలకం విమానాలే. ఈ క్రమంలో ఇండిగో సంక్షోభం,విమానాలకు బాంబు బెదిరింపులు సదస్సుపై ప్రభావం చూపిస్తాయని ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. దీనిపై ఇప్పటికే అప్రమత్తమైన అధికారులు తగిన ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవడానికి సిద్ధమైంది.

Read Also: వాట్సాప్​ కనుమరుగు కానుందా?

Follow Us on: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>