Mobile Popup Ad
Mobile Popup Ad

పార్లమెంట్ సాక్షిగా పచ్చి అబద్ధాలు.. కిషన్ రెడ్డిపై హరీశ్ రావు ఫైర్

కలం, వెబ్ డెస్క్: కాళేశ్వరం ప్రాజెక్టుపై కిషన్ రెడ్డి చేసిన కామెంట్స్‌ను హరీశ్ రావు (Harish Rao) తిప్పికొట్టారు. కాళేశ్వరంతో సాగు విస్తీర్ణం పెరిగిందని, కేంద్ర ప్రభుత్వ ‘ఎకనామిక్ సర్వే’ ద్వారా స్పష్టమైందని హరీశ్ రావు గుర్తు చేశారు. ప్రజాధనంతో నిర్మించే ప్రాజెక్టులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం కిషన్ రెడ్డి అవివేకానికి నిదర్శనమన్నారు. క్షేత్రస్థాయిలో పారుతున్న నీళ్లను చూసేందుకు సిద్ధంగా ఉన్నారా అని హరీశ్ రావు సవాల్ విసిరారు. రాష్ట్రానికి రావలసిన నిధులు, విభజన హామీల కోసం పోరాడాల్సింది పోయి, సీఎం రేవంత్ స్క్రిప్టును కిషన్ రెడ్డి చదివాడని ఆరోపించారు. కిషన్ రెడ్డి తెలంగాణ వాదాన్ని అణచివేయడం సిగ్గుచేటని విమర్శించారు.

రాజ్యసభలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) చేసిన వ్యాఖ్యలు తెలంగాణ ప్రయోజనాలకు, చారిత్రక వాస్తవాలకు విరుద్ధంగా ఉన్నాయని హరీశ్ రావు అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో రాజీనామాలకు వెనుకాడిన కిషన్ రెడ్డి పార్లమెంట్ సాక్షిగా చరిత్రను వక్రీకరిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారన్నారు. కాంగ్రెస్, బీజేపీల మధ్య ఉన్న చీకటి పొత్తుకు నిదర్శనమని హరీశ్ రావు అన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>