కలం, వెబ్‌డెస్క్: తెలంగాణ ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్’ (Telangana Rising Global Summit)కు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ (Jishnu Dev Varma) చేరుకున్నారు. ఆయనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతం పలికారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, పలువురు ప్రముఖులు సైతం ఈ కార్యక్రమానికి చేరుకున్నారు.
రంగారెడ్డి జిల్లా కందుకూరులోని ఫ్యూచర్‌సిటీలో 100 ఎకరాల విస్తీర్ణంలో ఈ కార్యక్రమం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సదస్సుకు 44 దేశాల నుంచి 154 మంది ప్రతినిధులు హాజరవుతున్నారు. సుమారు రెండు వేల మంది దేశ, విదేశీ అతిథులు ప్రారంభ వేడుకకు హాజరుకానుండడంతో అత్యాధునిక హంగులతో ఏర్పాట్లు చేశారు.
మధ్యాహ్నం రెండు గంటలకి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ (Jishnu Dev Varma) చేతుల మీదుగా కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి ప్రసంగిస్తారు. తెలంగాణలో ప్రజాపాలన, పెట్టుబడుల అవకాశాలు, ప్రభుత్వం అందించే సహకారం, విజన్ 2047 డాక్యుమెంట్ లక్ష్యాలు, భారత్ ఫ్యూచర్ సిటీపై ముఖ్యమంత్రి వివరిస్తారు. వివిధ దేశాల నుంచి ప్రతినిధులు ఫ్యూచర్ సిటీ వద్దకు చేరుకుంటున్నారు. వారికి నగరంలోని ప్రముఖ హోటళ్లలో బస ఏర్పాటు చేశారు. వీవీఐపీ పారిశ్రామికవేత్తలకు డీఎస్పీ ర్యాంకు అధికారితో భద్రత కల్పించారు.
Read Also: గ్లోబల్ సమ్మిట్… స్పెషల్ అట్రాక్షన్‌గా అక్కినేని నాగార్జున
Follow Us On: Instagram


