కలం, సినిమా : విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) తన భార్య రష్మిక మందన్న(Rashmika Mandanna) తో కలిసి స్వగ్రామం తుమ్మన్‌పేట(Thummanpet) చేరుకున్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా, బలమూరు మండలంలోని ఈ ప్రాంతంలో ప్రస్తుతం సందడి వాతావరణం నెలకొంది. విజయ్- రష్మిక జంట నూతన ఫామ్ హౌస్‌లో గృహప్రవేశం, సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా అభిమానులు పెద్ద సంఖ్యలో తుమ్మన్‌పేటకు చేరుకుని సందడి సృష్టించారు. ఇప్పటికే తుమ్మన్‌పేటలో ఈ జంట రాక కోసం భారీగా ఏర్పాట్లు చేశారు. ఇదిలా ఉంటే మార్చి 4వ తేదీన హైదరాబాద్‌లో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ వేడుకకు సినీ, రాజకీయ ప్రముఖులు తరలి రానున్నారు.

