కలం, వెబ్ డెస్క్: ఓ వైపు లొంగుబాట్లు, మరోవైపు ఎన్‌కౌంటర్లతో మావోయిస్టు పార్టీ క్రమంగా పతనం అవుతోంది. తాజాగా ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో భారీ లొంగుబాటు చోటుచేసుకున్నది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో 12 మంది మావోయిస్టులు (Maoist Surrender) లొంగిపోయారు. వీరిలో కేంద్రకమిటీ సభ్యుడు రాంధేర్ (Ramdher Mazji) కూడా ఉన్నారు. రాంధెర్ ప్రస్తుతం ఎంఎంసీ (Malkangiri–Mahasamund–Chhattisgarh region) ప్రాంతంలో క్రియాశీలకంగా ఉన్నారు.
దీంతో ఆ ప్రాంతంలో నక్సల్ ప్రభావం దాదాపుగా తగ్గిపోయినట్టేనని తెలుస్తోంది. మావోయిస్టు కీలకనేత మిలింద్ తెల్టుంబే మరణించాక ఎంఎంసీ బాధ్యతలను రాంధెర్ చూసుకుంటున్నారు. మొత్తం 12 మంది తమ ఆయుధాలను అప్పగించారు. లొంగిపోయిన వారిలో రాందెర్ మజ్జీ, చందూ ఉసెండీ, లలితా, జానకి, ప్రేమ, రామ్‌సింగ్ దాదా, సుకేశ్ పొట్టమ్, లక్ష్మీ, శీలా, సాగర్, కవిత, యోగిత ఉన్నారు.
Read Also: IAS ఆమ్రపాలికి హైకోర్టులో చుక్కెదురు !
Follow Us on: Youtube


