Mobile Popup Ad
Mobile Popup Ad

ట్రంప్‌కు బిగ్ షాక్.. అమెజాన్ డేటా సెంటర్‌పై ఇరాన్ దాడి

కలం, వెబ్ డెస్క్: పశ్చిమాసియా యుద్ధం అనేక మలుపులు తిరుగుతోంది. అమెరికా చేస్తున్న దాడులను ఇరాన్ (Iran) దీటుగా తిప్పికొడుతోంది. ఒకవైపు శాంతి చర్చలకు డిమాండ్లు పెడుతూనే.. మరోవైపు దాడులకు దిగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఇరాన్ అమెజాన్ డేటా సెంటర్ (Amazon Data Center) దాడి చేయడం ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతోంది. బహ్రెయిన్‌లోని అమెజాన్ క్లౌడ్ కంప్యూటింగ్ డేటా సెంటర్ లక్ష్యంగా ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది. ఈ దాడిలో డేటా సెంటర్‌లోని సర్వర్లు, మౌలిక సదుపాయాలు తీవ్రంగా దెబ్బతినడంతో, గల్ఫ్ రీజియన్‌లోని క్లౌడ్ సేవలకు భారీ అంతరాయం ఏర్పడింది.

అమెరికన్ వాణిజ్య, సాంకేతిక సంస్థలను ఇరాన్ లక్ష్యంగా చేసుకుంది. ఈ సంస్థలు శత్రు దేశాల నిఘా, సైనిక కార్యకలాపాలకు సహకరిస్తున్నాయని ఆరోపిస్తూ ఈ దాడులకు పాల్పడింది. కేవలం అమెజాన్ మాత్రమే కాకుండా, తమపై జరుగుతున్న దాడులకు ప్రతీకారంగా మరిన్ని అమెరికన్ టెక్ దిగ్గజాలపై దాడులు చేస్తామని ఇరాన్ హెచ్చరించడం అంతర్జాతీయంగా ఆందోళన కలిగిస్తోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>