Mobile Popup Ad
Mobile Popup Ad

ఆకివీడు అల్లర్ల వెనుక ఐపీఎస్ అధికారి: రఘురామ

కలం, వెబ్ డెస్క్: ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు రామాలయం దగ్గర శ్రీరామనవమి సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత (Akiveedu Temple Clash)  చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఇక్కడి పురాతన రామాలయంలో పూజలు నిర్వహించేందుకు ఎంపీ రఘురామకృష్ణంరాజు ఆకివీడు పట్టణానికి వచ్చాడు. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నది. ఇరువర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. అయితే తాజాగా ఈ గొడవపై రఘురామ స్పందించారు. ఈ ఘర్షణ వెనుక సస్పెండెడ్ ఐపీఎస్ ఆఫీసర్ పీవీ సునీల్ కుమార్ ఉన్నారని రఘురామ ఆరోపించారు. ఆయన ప్రోద్బలంతోనే ఘర్షణ జరిగిందని చెప్పారు.

ఈ ఘటనకు (Akiveedu Temple Clash) సంబంధించిన దర్యాప్తులో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయని పేర్కొన్నారు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యల ప్రకారం, ఇస్మాయిల్, రాజేష్ ఖన్నా, మీసాలరాజు అనే ముగ్గురు వ్యక్తులు ఈ ఘటనకు బాధ్యులని చెప్పారు. వీరంతా ఘటనకు ముందు పీవీ సునీల్ కుమార్‌తో ఫోన్‌లో మాట్లాడారని.. సునీల్ కుమార్ పాత్రపై విచారణ జరుగుతోందని చెప్పారు.

కాల్ డేటా ఆధారంగా నిందితులతో సునీల్ కుమార్‌కు (Sunil Kumar) ఉన్న సంబంధాలను గుర్తిస్తామని చెప్పారు. సాంకేతిక ఆధారాలు పరిశీలిస్తే ఈ ఘటన వెనుక ఉన్న నిజాలు బయటపడతాయని ఆయన అభిప్రాయపడ్డారు. దర్యాప్తు సంస్థలు ఈ కోణంలో లోతుగా విచారణ జరపాలని కూడా కోరారు.

Read Also: అమ‌రావ‌తి బిల్లుకు లోక్‌స‌భ ఆమోదం.. ప‌వ‌న్ కల్యాణ్ ఎమోష‌న‌ల్ పోస్ట్!

Follow Us On: Pinterest

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>