కలం,వెబ్ డెస్క్: రక్షణ ఉత్పత్తుల తయారీలో మన దేశం అద్భుత ప్రగతి సాధించిందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ (Rajnath Singh) అన్నారు. లేహ్ లో ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర పాలిత ప్రాంతాలు లడక్, జమ్మూకశ్మీర్ తోపాటు అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, మిజోరంలో రూ.5వేల కోట్లతో బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (బీఆర్వో) నిర్మించిన 125 ప్రాజెక్టులను ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడారు.
‘ఒకప్పుడు దేశీయంగా అవసరమైన ఆయుధాలు తయారు చేసుకోవడానికి కూడా మన దగ్గర తగిన వ్యవస్థ లేదు. అయితే, గత పదేళ్లలో ఆ పరిస్థితిని అధిగమించాం. 2014లో రూ.46వేల కోట్ల రూపాయల విలువైన రక్షణ ఉత్పత్తులు మాత్రమే ఉండేవి. మన కఠోర శ్రమ వల్ల ప్రస్తుతం దానిని లక్షన్నర కోట్లకు చేర్చాం. అలాగే పదేళ్ల కింద మన రక్షణ ఉత్పత్తుల ఎగుమతులు రూ.వెయ్యి కోట్ల లోపే ఉండేవి. ప్రస్తుతం దాన్ని రూ.24వేల కోట్లకు చేర్చాం. అంటే రక్షణ ఉత్పత్తులను దిగుమతి చేసుకునే స్థాయి నుంచి ఎగుమతి చేసే స్థాయికి ఎదిగాం’ అని రాజ్ నాథ్ సింగ్ (Rajnath Singh) అన్నారు.
భౌగోళికంగాను, వాతావరణ పరంగాను అత్యంత కఠినమైన పరిస్థితులు ఉన్న ప్రాంతాల్లో మౌలిక వసతులు మెరుగు పర్చేందుకు బీఆర్వో అద్భుతంగా పనిచేస్తోందంటూ ఆయన కొనియాడారు. గత రెండేళ్లలోనే దేశవ్యాప్తంగా 356 ప్రాజెక్టులను పూర్తి చేసి, వాటిని జాతికి అంకితం చేయడంలో బీఆర్వో అసాధారణ కృషి చేసిందన్నారు.కాగా, బీఆర్వోకు కేటాయింపులను రూ.6,500 కోట్ల నుంచి రూ.7,416 కోట్లకు కేంద్రం ప్రభుత్వం 2024–25 బడ్జెట్ లో పెంచింది.
Read Also: సర్పంచ్ అభ్యర్థులకు అప్పు పుడ్తలేదా?
Follow Us On: Pinterest


