కలం, వెబ్ డెస్క్: పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్ కతా నగరం ఆదివారం కాషాయమయమైంది. జై శ్రీ కృష్ణ భగవాన్, జై హిందూ నినాదాలు, శంఖనాదాలతో హోరెత్తింది. నగరమంతా కాషాయ జెండాలు రెపరెపలాడాయి. బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్ లో ‘సనాతన సంస్కృతి సంసద్’ అనే ధార్మిక సంస్థ ‘పాంచ్ లాకో కొంథే గీతా పఠ్’ అనగా ఐదు లక్షల గళాలతో గీతా పారాయణం (Gita Path Recitation) పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో లక్షలాది మంది పాల్గొన్నారు. బెంగాల్ తో పాటు సమీప రాష్ట్రాల నుంచి లక్షలాదిగా ప్రజలు, సాధువులు, వివిధ మఠాల ప్రతినిధులు తరలివచ్చారు.
పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్, కేంద్రమంత్రి సుకాంత మజుందార్, బీజేపీ నాయకుడు సువేందు అధికారి, ఆ పార్టీ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. కార్యక్రమంలో 6.5లక్షల మంది పాల్గొన్నట్లు నిర్వాహకులు చెప్పారు. ఇది దేశంలోనే అతి పెద్ద సామూహిక గీతా పారాయణం (Gita Path Recitation) అని అన్నారు. కాగా, బాబ్రీ మసీదును పోలిన మసీదు నిర్మాణానికి రాష్ట్రంలోని బెల్దాంగ జిల్లాలో శనివారం తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) బహిష్కృత ఎమ్మెల్యే హుమయూన్ కబీర్ శంకుస్థాపన చేశారు. దీనికి పోటీగానే లక్షలాది మందితో నేడు గీతాపారాయణం కార్యక్రమాన్ని బీజేపీ నిర్వహించిందని టీఎంసీ విమర్శించింది. అయితే, దీన్ని బీజేపీ తోసిపుచ్చింది. 2023లోనూ లక్షమందితో గీతా పారాయణం నిర్వహించిన విషయాన్ని గుర్తు చేసింది.
Read Also: ‘న్యాయం చేయండి’.. మోదీకి పాక్ మహిళ రిక్వెస్ట్
Follow Us On : X(Twitter)


