కలం, వెబ్ డెస్క్: Hyderabad Roads | ఓఆర్ఆర్, రావిర్యాలను కలుపనున్న కొత్త గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్డుకు పద్మభూషణ్ రతన్ టాటా పేరు పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే రావిర్యాల ఇంటర్‌చేంజ్‌కు ‘టాటా ఇంటర్‌చేంజ్(TATA Interchange)’ అని పేరు పెట్టిన విషయం తెలిసిందే.
దీంతోపాటు హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్‌కు ఆనుకుని ఉన్న రోడ్డుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరును పెట్టనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ రోడ్డును ‘డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ(Donald Trump Avenue)’గా పిలవనున్నారు. ఈ విషయంపై కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖకు, అమెరికా రాయబార కార్యాలయానికి రాష్ట్ర ప్రభుత్వం సమాచారం ఇవ్వనుంది.
ఈ ఏడాది మొదట్లో ఢిల్లీలో జరిగిన యూఎస్ ఇండియా స్ట్రాటెజిక్ పార్ట్‌నర్‌షిప్ ఫోరం సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, హైదరాబాద్‌లోని ప్రధాన రోడ్ల(Hyderabad Roads)కు గ్లోబల్ కంపెనీల పేర్లు పెట్టే ప్రతిపాదనను తీసుకొచ్చారు. గూగుల్ మ్యాప్స్ సేవలకు గుర్తింపుగా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో కంపెనీ నిర్మిస్తున్న అతిపెద్ద క్యాంపస్‌కు ఆనుకున్న రోడ్డుకు ‘గూగుల్ స్ట్రీట్(Google Street)’ పేరును పెట్టాలని నిర్ణయించారు.
ఇది అమెరికా వెలుపల గూగుల్ అతిపెద్ద క్యాంపస్ కానున్నది. అదేవిధంగా, మైక్రోసాఫ్ట్, విప్రో సంస్థల పేర్లను కూడా హైదరాబాద్ భౌగోళిక గుర్తుల్లో భాగం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో ‘విప్రో జంక్షన్’, ‘మైక్రోసాఫ్ట్ రోడ్’ వంటి పేర్లు పరిశీలనలో ఉన్నాయి.
Read Also: భారత్ లో ఉండడం హసీనా సొంత నిర్ణయం: జైశంకర్
Follow Us On: Instagram


