epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

ఒకే దారిని నమ్ముకున్న ప్రభాస్, చిరంజీవి.. ఎవరు నెగ్గుతారో..?

కలం, వెబ్ డెస్క్: ప్రభాస్, చిరంజీవి ఫస్ట్ టైమ్ ఒకేసారి పోటీ పడుతున్నారు. 2026 సంక్రాంతికి వీరి సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. ఇక్కడ ఓ కామన్ పాయింట్ ఏంటంటే వీరిద్దరి సినిమాలు ఈ సారి కామెడీ యాంగిల్ లోనే రాబోతున్నాయి. మారుతి డైరెక్షన్ లో ప్రభాస్ (Prabhas) చేస్తున్న ది రాజాసాబ్, అనిల్ రావిపూడి డైరెక్షన్ లో చిరంజీవి (Chiranjeevi) చేస్తున్న మన శంకర వర ప్రసాద్ రెండూ కామెడీ మెయిన్ థీమ్ తో వస్తున్నాయి. ప్రభాస్ ఫస్ట్ టైమ్ హర్రర్ సినిమాలో నటిస్తున్నాడు. ఇది హర్రర్ అండ్ కామెడీ ప్రధానంగా వస్తున్న మూవీ. అటు చిరంజీవి నటిస్తున్న మన శంకర వర ప్రసాద్ అయితే కామెడీనే మెయిన్ థీమ్ గా ఎంచుకుని వస్తోంది.

సంక్రాంతికి వీరిద్దరి సినిమాలతో పాటు రవితేజ, నవీన్ పోలిశెట్టి, శర్వానంద్ మూవీలు కూడా ఉన్నాయి. కానీ ప్రభాస్ (Prabhas), చిరు సినిమాలపైనే భారీ హైప్ ఉంది. సంక్రాంతి మొత్తం వీరిద్దరి హవానే కనిపిస్తోంది. పైగా ఇద్దరూ కామెడీనే నమ్ముకుంటున్నారు. ప్రభాస్ సినిమా పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ అవుతోంది. చిరుది తెలుగు రాష్ట్రాలకే పరిమితం. బడ్జెట్ పరంగా ది రాజాసాబ్ దే ఎక్కువ. పైగా హర్రర్ మూవీ.. మొన్న వచ్చిన టీజర్ లో ఆ స్థాయి వీఎఫ్ ఎక్స్ కూడా ఉంది. చిరంజీవి (Chiranjeevi) సినిమా నుంచి వస్తున్న పాటలు బ్యూటిఫుల్ గా ఉంటున్నాయి. కానీ ట్రైలర్ రిలీజ్ అయ్యాకే మన శంకర వర ప్రసాద్ అసలు సత్తా ఏంటో తెలుస్తుంది. ప్రమోషన్ల పరంగా అనిల్ రావిపూడి ఇరగదీస్తున్నాడు. ఎందుకంటే పోటీ ఎక్కువగా ఉందని. మరి ప్రభాస్ పైచేయి సాధిస్తాడా లేదా చిరు డామినేట్ చేస్తాడా చూద్దాం.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>