కలం, వెబ్ డెస్క్: తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 (Bigg Boss Telugu 9)లో ఈ సారి విన్నర్ ఎవరనేదాని గురించే చర్చ జరుగుతోంది. మొదట్లో సుమన్ శెట్టి అనే టాక్ వినపడింది. తర్వాత తనూజను హైలెట్ చేశాడు. మధ్యలో ఇమ్మాన్యుయెల్ విన్నర్ అయ్యేలా చూపించాడు. కానీ చివరకు ఎవరూ ఊహించని కంటెస్టెంట్ గురించే అంతా చర్చ జరుగుతోంది. ఇప్పటికే 13 వారాలు పూర్తి అయ్యాయి. ఈ ఆదివారం హౌస్ నుంచి రీతూ చౌదరి ఎలిమినేట్ అయిపోతోంది. ఆమె ఎలిమినేషన్ వెనకాల కూడా విన్నర్ ను దృష్టిలో పెట్టుకున్నట్టు తెలుస్తోంది. ఈ సారి కల్యాణ్ పడాలను విన్నర్ చేస్తున్నట్టు జోరుగా ప్రచారం సాగుతోంది.
అందుకే అతన్ని బాగా హైలెట్ చేస్తున్నాడు బిగ్ బాస్ (Bigg Boss Telugu 9). నాగార్జున కూడా కల్యాణ్ కు ఆర్మీ స్టైల్ లో ఈ వారం సెల్యూట్ కొట్టాడు. అద్భుతంగా ఆడుతున్నావ్ అంటూ మెచ్చుకున్నాడు. ఓటింగ్ లో కూడా కల్యాణ్ దూసుకుపోతున్నాడు. కాగా హౌస్ లో రీతూతో మొదట్లో రాసుకుని, పూసుకుని తిరిగాడు కల్యాణ్. రీతూ కావాలనే కల్యాణ్ ను ట్రాప్ చేసింది. అదంతా బిగ్ బాస్ స్క్రిప్టులో భాగమే అయినా చూసే జనాలకు రీతూ హౌస్ లో ఉంటే కల్యాణ్ మీద ఇంప్రెస్ ఏర్పడదు కదా. అందుకే ఈ వారం రీతూను బయటకు పంపించేసినట్టు తెలుస్తోంది. టైటిల్ రేసులో తనూజ, కల్యాణ్ ,ఇమ్మాన్యుయే మాత్రమే ఉన్నారు.
తనూజ సీరియల్ నటి కాబట్టి ఆమెను విన్నర్ చేసే పరిస్థితులు లేవు. అటు ఇమ్మాన్యుయెల్ ఈటీవీ నుంచి వచ్చాడు కాబట్టి అతనికి కూడా కప్ దక్కకపోవచ్చు. ఈటీవీ నుంచి వచ్చిన వారికి ఇప్పటి దాకా కప్ దక్కనేలేదు. కల్యాణ్ ఆర్మీ జవాన్ కాబట్టి.. అతనికి ఇస్తే ప్రజల్లో బిగ్ బాస్ మీద సింపతీ క్రేజ్ పెరుగుతుందనే ప్లాన్ లో ఉన్నారంట. చివర్లో ట్విస్ట్ ఇవ్వకుంటే కల్యాణ్ పడాల తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 (Bigg Boss Telugu 9) విన్నర్ కావడం పక్కా.
Read Also: ఒకే దారిని నమ్ముకున్న ప్రభాస్, చిరంజీవి.. ఎవరు నెగ్గుతారో..?
Follow Us On: Pinterest


