కలం డెస్క్ : Healthy Foods | మనం ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని ఆహార పదార్థాలను డైట్ లో చేర్చుకోవాలి అని నిపుణులు చెబుతున్నారు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. వారంలో కనీసం మూడుసార్లు అయినా ఆకుకూరలను తినాలని సూచిస్తున్నారు. ఉడకబెట్టిన సెనగలు, వేరుశనగలు, అలసందలు వారంలో రెండు మూడు రోజులు స్నాక్స్ లా తీసుకోవడం మంచిదంటున్నారు.
అమ్మమ్మల నాటి సాంప్రదాయ వంటలైన తెల్ల నువ్వులు ఉండలు, పల్లీ ఉండలు, సున్నుండలు, కచ్చితంగా తినాలని చెబుతున్నారు. అయితే వీటిని బెల్లంతో తయారు చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయని చెబుతున్నారు. అలాగే సీజనల్ గా దొరికే పండ్లను వారంలో రెండు మూడు సార్లు అయినా తినాలంటున్నారు. నానబెట్టిన బాదంపప్పు, జీడిపప్పు, పిస్తా పప్పు వంటివి కూడా స్నాక్స్ లా తీసుకోవడం మంచిది అని అంటున్నారు. అయితే వీటిని పరిమితంగా మాత్రమే తీసుకోవాలని సూచిస్తున్నారు. వీటితోపాటు ఆహారాన్ని వేడివేడిగా తినడం మంచిదని చెబుతున్నారు.

