కలం, వెబ్‌డెస్క్ : తన భర్త రెండో పెళ్లి చేసుకుంటున్నాడని న్యాయం చేయాలని పాకిస్తాన్ కు చెందిన ఓ మహిళ (Pak Woman) ప్రధాని మోదీ (PM Modi)కి భావోద్వేగంతో కూడిన వీడియో సందేశం పంపింది. కరాచీకి చెందిన నిఖిత.. 2020 జనవరిలో హిందూ ఆచారాల ప్రకారం పాకిస్తాన్ లో దీర్ఘకాలిక వీసాపై ఉంటున్న ఇండోర్ కు చెందిన పాకిస్తాన్ మూలాలు ఉన్న విక్రమ్ నాగ్దేవ్ ను వివాహం చేసుకుంది.
పెళ్లి తరువాత ఫిబ్రవరిలో విక్రమ్.. నిఖితను ఇండియాకు తీసుకువచ్చాడు. అయితే, అదే ఏడాది జూలైలో వీసా సమస్య కారణం చూపిస్తూ తనను విక్రమ్ అట్టారి బార్డర్ నుంచి పాకిస్తాన్ కు పంపించేశాడని నిఖిత వీడియోలో పేర్కొంది. అప్పటి నుంచి తనను భారత్ కు తిరిగి రప్పించే ప్రయత్నం చేయడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. లాక్ డౌన్ టైంలో బలవంతంగా పాకిస్తాన్ కు పంపించేశారని ఆరోపించింది. ఇప్పుడు మరోమహిళను విక్రమ్ రెండో పెళ్లి చేసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నాడని తెలిపింది.
ఇలాంటి సమయంలో మహిళకు న్యాయం జరగకపోతే.. వ్యవస్థ మీద నమ్మకం పోతుందని పేర్కొంది. తనకు అందరు అండగా నిలవాలని వీడియోలో నిఖిత అభ్యర్థించింది. అలాగే, పెళ్లి అయిన తరువాత అత్తింటివారి వైఖరి మారిపోయిందని చెప్పుకొచ్చింది. విక్రమ్ కు బంధువుల్లో ఒకరితో సంబంధం ఉన్నట్లు తెలిసిందని, దీనిపై ప్రశ్నించినా ఎవరూ పట్టించుకోలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.
తనను పాకిస్తాన్ కు పంపించేశాక మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాడని 2025లో ఫిర్యాదు చేసింది. ఈ కేసును మధ్యప్రదేశ్ హైకోర్టు పరిధిలోని సింధీ పంచ్ మీడియేషన్ అండ్ లీగల్ కౌన్సిల్ సెంటర్ స్వీకరించి విక్రమ్ తో పాటు అతనికి కాబోయే భార్యకు నోటీసులు జారీ చేసి విచారణ చేసింది. అయితే, మధ్యవర్తిత్వం విఫలం అయింది. నివేదికలో ఇద్దరూ భారత పౌరులు కాదని.. కేసు పాకిస్తాన్ కు పరిధిలో ఉన్నందున విక్రమ్‌ను పాక్ కు డిపోర్ట్ చేయాలని సూచించింది. ప్రస్తుతం పాక్ మహిళ (Pak Woman) పీఎం మోడీకి చేసిన వినతి అంశం నెట్టింట వైరల్ గా మారింది.
Read Also: భారత్ లో ఉండడం హసీనా సొంత నిర్ణయం: జైశంకర్
Follow Us on: Youtube


