కలం, వెబ్ డెస్క్: ఇండిగో ఫ్లైట్స్ మీద బీజేపీ(BJP) ఎందుకు సైలెంట్ గా ఉంటుంది. వేరే విషయాలపై గొంతెత్తి ప్రశ్నించే బీజేపీ నేతలు.. దేశ వ్యాప్తంగా ఇంత పెద్ద క్రైసిస్ జరుగుతుంటే ఎందుకు మౌనంగా ఉంటున్నారు అనేదే ఇక్కడ ప్రశ్న. పార్లమెంట్ సమావేశాలకు కూడా ఎంపీలు వెళ్లలేక ఇబ్బందులు పడ్డారు. ఎయిర్ పోర్టుల్లో ఇప్పటికీ వేల మంది ఫ్లైట్ల కోసం పడిగాపులు కాస్తున్నారు. ఈ క్రైసిస్(Indigo Crisis) మీదే కాంగ్రెస్ తో పాటు ఇతర లోకల్ పార్టీలు కూడా సీరియస్ గా స్పందిస్తున్నాయి. ఇండిగోను ఏకిపారేస్తున్నాయి. డీజీసీఏ రూల్స్ గురించి ముందే తెలిసి కూడా కావాలనే ఇండిగో ఇలా చేస్తోందని అంటున్నారు. ఇండియన్ ఎయిర్ లైన్స్ లో ఎక్కువ షేర్ ఇండిగోకు ఉండటం వల్లే ఇలాంటి క్రైసిస్ వచ్చిందని.. అన్ని కంపెనీలకు సమానంగా వాటాలు ఉండాలంటున్నారు.
కానీ ఈ విషయాలపై బీజేపీ నేతలు సైలెంట్ గా ఉంటున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ కూడా దీనిపై ఓపెన్ స్టేట్ మెంట్ ఇవ్వట్లేదు. కేవలం రామ్మోహన్ నాయుడే దీని గురించి స్పందిస్తున్నారు. మిగతా బీజేపీ నేతలకు ఏమైంది. ప్రజలు ఇంత ఇబ్బంది పడుతుంటే ఇండిగో మీద ఎందుకు మాట్లాడట్లేదు. ఇండిగో ఏమీ బీజేపీ నేతలది కాదు కదా. అదో ప్రైవేట్ సంస్థ. దానికి వ్యతిరేకంగా మాట్లాడొద్దని బీజేపీ లీడర్లకు ఏమైనా ఆదేశాలున్నాయా. వేరే చిన్న చిన్న విషయాలపై ఓ రేంజ్ లో మాట్లాడుతూ తిట్టే బీజేపీ లీడర్లు.. ఇంత పెద్ద క్రైసిస్ మీద మాట్లాడకపోవడం అంటే కచ్చితంగా వెనకాల ఏదో జరుగుతోందని అర్థం చేసుకోవాలి.
బీజేపీ లీడర్లు ఏం మాట్లాడాలి అనుకున్నా పై నుంచి వచ్చే ఆర్డర్ల ప్రకారమే మాట్లాడుతారు. ఇండిగో(IndiGo Crisis) గురించి మాట్లాడితే బీజేపీకి వచ్చే నష్టమేమీ లేదు. వాళ్ల మైలేజీ కూడా తగ్గదు. ఎందుకంటే ఈ సంక్షోభానికి పూర్తి బాధ్యత ఇండిగో కంపెనీదే గానీ ప్రభుత్వానికి కాదు కదా. కాకపోతే గుత్తాధిపత్యం గురించి ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి కాబట్టి ఆ విషయంలో బీజేపీ మాట్లాడితే తమకే మైనస్ అవుతుందని భావిస్తున్నారేమో.
Read Also: ట్రంప్‌కు ఫిఫా శాంతి బహుమతి
Follow Us on: Youtube


