అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump)కు ఎట్టకేలకు శాంతి బహుమతి దక్కింది. ఎంతో కాలంగా ఆయన నోబెల్ శాంతి బహుమతి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా తాజాగా ఆయనకు ఫిఫా తొలి శాంతి బహుమతి(FIFA Peace Prize) అందించి గౌరవించింది. ప్రపంచ శాంతి స్థాపనకు ఆయన చేసిన కృషిని గుర్తిస్తూ ఫిఫా తన తొలి శాంతి బహుమతిని ట్రంప్‌కు ప్రదానం చేసింది. ఈ శాంతి పురస్కారం అందించింది శుక్రవారమే అయినా.. తాజాగా నెట్టింట ఈ అంశం భారీగా బజ్ క్రియేట్ చేస్తోంది. తొలి ఫిఫా శాంతి అవార్డు ట్రంప్ చేతుల్లోకే చేరడం రాజకీయ, క్రీడా వర్గాల్లో చర్చనీయాంశమైంది. డ్రా ప్రకారం తీసిన ఫిఫా పీస్ అవార్డ్‌ను ట్రంప్ కొన్నారని కూడా కొందరు ఆరోపిస్తున్నారు. శుక్రవారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఫిఫా అధ్యక్షుడు జియాని ఇన్‌ఫాంటినో స్వయంగా ట్రంప్‌ను సత్కరించారు. ఇటీవలే ఫిఫా ఈ శాంతి పురస్కారాన్ని ప్రవేశపెట్టగా, ప్రపంచవ్యాప్తంగా శాంతి కోసం విశిష్టమైన చర్యలు తీసుకున్నవారిని ఈ గౌరవానికి ఎంపిక చేస్తామని స్పష్టం చేసింది. తొలి అవార్డుగా ట్రంప్‌ను ఎంపిక చేయడం విశేషం.
డ్రా కార్యక్రమంలో 2026 వరల్డ్‌కప్ ఫార్మాట్‌ను కూడా ప్రకటించారు. తొలిసారి 48 జట్లు పోటీపడనుండగా, 12 గ్రూపులుగా విభజించారు. శాంతి బహుమతి అందడంపై ట్రంప్ స్పందిస్తూ.. “నా జీవితంలో అత్యుత్తమ గౌరవం” అని అన్నారు. “నా జీవితంలో దక్కిన అత్యుత్తమ గౌరవం ఇదే. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది ప్రాణాలను కాపాడేందుకు నేను కృషి చేశాను. భారత్–పాకిస్థాన్ కాల్పుల విరమణ, అనేక యుద్ధాలను ఆపేందుకు నా పాత్ర ఎంతో కీలకం” అని ట్రంప్(Donald Trump) పేర్కొన్నారు. అమెరికాను మరల ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన దేశంగా మార్చానని, ప్రజల ప్రాణాలే తన తొలి ప్రాధాన్యత అని ఆయన అన్నారు.
Read Also: యూఎస్ డాలర్‌కు గుడ్ బై.. ప్రముఖ ఆర్థిక వేత్త సంచలన ట్వీట్
Follow Us On: Pinterest


