Mobile Popup Ad
Mobile Popup Ad

ఆప‌రేష‌న్ క్రాక్‌డౌన్‌.. క‌రీంన‌గ‌ర్ పోలీసుల‌కు షాకిచ్చిన కోర్ట్‌!

క‌లం, వెబ్ డెస్క్‌: క‌రీంన‌గ‌ర్ (Karimnagar) పోలీసుల‌కు కోర్ట్ షాకిచ్చింది. జిల్లాలో ఆప‌రేష‌న్ క్రాక్ డౌన్ (Operation Crackdown) పేరుతో పోలీసులు అరెస్ట్ చేసిన 13 మంది నిందితుల రిమాండ్‌ను కోర్ట్ తిర‌స్క‌రించింది. క‌రీంన‌గ‌ర్‌లోని కిసాన్‌న‌గ‌ర్‌లో ఉన్న ఆర్‌బీఎల్ బ్యాంకులో సుమారు రూ.130 కోట్ల కుంభ‌కోణం జ‌రిగింద‌ని, బ్యాంకులో న‌కిలీ ఖాతాలు సృష్టించి, మ్యూల్ ఖాతాల ద్వారా పెద్ద మొత్తంలో నిధులు మ‌ళ్లించిన‌ట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో బ్యాంక్ మేనేజ‌ర్‌, ఉద్యోగులు స‌హా, ప‌లువురు అనుమానితుల‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ సైబర్ క్రైమ్ కేసుకు సంబంధించి జిల్లా కోర్టు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. బ్యాంకు అధికారుల ఫిర్యాదు లేకుండా అక్ర‌మాలు ఎలా జ‌రిగాయంటూ నిర్థారిస్తార‌ని పోలీసుల‌ను ప్ర‌శ్నించింది. అరెస్ట్ చేసిన వారికి వెంట‌నే స్టేష‌న్ బెయిల్ ఇచ్చేయాల‌ని ఆదేశాలు జారీ చేసింది.

 Read Also: మద్యం ప్రియులకు వార్​ షాక్​

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>