ప్రేమ జంట అదృశ్యం.. కాలువ‌లో శ‌వ‌మై తేలిన ప్రియుడు!

క‌లం, వెబ్ డెస్క్‌: జ‌గిత్యాల (Jagtial) జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కొద్ది రోజుల క్రితం ఓ ప్రేమ జంట అదృశ్య‌మ‌వ‌గా తాజాగా ప్రియుడు కాలువ‌లో శ‌వ‌మై తేలాడు. మెట్‌ప‌ల్లి మండ‌లంలోని పెద్దాపూర్‌లో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. వివ‌రాల్లోకి వెళ్తే.. మ‌హారాష్ట్ర‌కు చెందిన అంకుష్ అనే యువ‌కుడు కూలీ ప‌నుల కోసం కొంత కాలం క్రితం మెట్‌ప‌ల్లికి వ‌చ్చాడు. మెట్‌ప‌ల్లి మండ‌లంలోని వెల్లుల గ్రామానికి చెందిన ఓ యువ‌తిని ప్రేమించాడు. రెండు రోజుల నుంచి యువ‌తితో పాటు అంకుష్ క‌నిపించ‌డం లేదు. ఈ క్ర‌మంలో తాజాగా స్థానిక‌ ఎస్సారెస్పీ కాలువ‌లో అంకుష్ మృత‌దేహం ల‌భ్యమైంది. యువ‌తి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇద్ద‌రు ఆత్మ‌హ‌త్య చేసుకొని ఉంటారా? లేక ఎవ‌రైనా అంకుష్‌ను హ‌త్య చేశారా? అనే కోణంలో పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>