epaper
Friday, January 16, 2026
spot_img
epaper

ప్రైవేట్ కార్ల సర్వీస్‌లకు భారీ డిమాండ్


కలం, వెబ్‌డెస్క్ : ఇండిగో విమాన సంక్షోభం(Indigo Crisis) కొనసాగుతూనే ఉంది. ఆరో రోజు కూడా సంస్థ సర్వీసులను పునరుద్ధరించని కారణంగా వందలాది ఫ్లైట్లు క్యాన్సిల్ అయ్యాయి. ఇండిగో సంస్థ ఇంటర్నల్ ఇష్యూ, సిబ్బంది- పైలట్ల కొరత కారణంగా అకస్మాత్తుగా సర్వీసులను రద్దు చేస్తున్నారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ కారణంతో ఎక్కువమంది ప్రత్యామ్నాయ మార్గాలను ఆశ్రయిస్తున్నారు.

మరోవైపు, హైదరాబాద్ లో ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్(Global Summit) – 2025’ ను రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నది. సదస్సుకు జాతీయ, అంతర్జాతీయ స్థాయి ప్రతినిధులను ప్రభుత్వం ఆహ్వానించింది. దాదాపు 3000 మంది ఈ సమ్మిట్ కు హాజరుకానున్నారు. దీని కోసం ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. అతిథులకు ఎలాంటి సౌకర్యం కలగకుడా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఈ కారణంగా హైదరాబాద్ నగరానికి వచ్చే ప్రయాణికుల రద్దీ ఏర్పడనుంది. దీంతో ప్రైవేట్ క్యాబ్ సర్వీసులకు భారీ డిమాండ్ ఏర్పడే అవకాశాలు ఉన్నాయి.

రోడ్డు మార్గానికే మొగ్గు

ఇండిగో విమానాల సర్వీసులను(Indigo Crisis) రద్దు చేయడం వల్ల ఇతర సర్వీసులు తమ టికెట్ చార్జీలను పెంచేశాయి. రైళ్ల సర్వీసులను పెంచామని చెబుతున్న కేంద్రం.. అది ఆచరణలో కనిపించడం లేదు. దీంతో హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, పుణే, గోవా వంట నగరాలకు వెళ్లాలనుకునే వారు ఔట్ స్టేషన్ క్యాబులు బుక్ చేసుకుంటున్నారు. ఈ కారణంగా ప్రైవేట్ ట్రావెల్స్, క్యాబ్ ఆపరేటర్లకు ఎప్పుడూ లేనంతగా బుకింగ్ లు వస్తున్నాయి.

గ్లోబల్ సమ్మిట్‌పై ఎఫెక్ట్..

హైదరాబాద్ లో ప్రస్తుతం గ్లోబల్ సమ్మిట్ నెలకొన్నది. అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించనున్న ఈ సదస్సుకు ఫారెన్ డెలిగేట్లు, కార్పొరేట్ సంస్థల ప్రతినిధులు, పరిశ్రమలకు చెందిన ముఖ్యులు నగరానికి చేరుకుంటున్నారు. ఎయిర్ పోర్టు నుంచి నగరంలోకి రావడం కోసం ప్రభుత్వం ఇన్ సర్వీసులను ఏర్పాటు చేసింది. దీనికోసం లగ్జరీ కార్లను వినియోగించడంతో వాటికి భారీ డిమాండ్ పెరిగింది. విమానాల రద్దు కావడం.. నగరానికి అతిథుల రాకతో ప్రైవేట్ కార్ల సర్వీసుల 40 నుంచి 60 శాతం డిమాండ్ పెరిగనున్నాయి. దీంతో ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది. మొత్తానికి ఇండిగో సంక్షోభం ప్రైవేట్ క్యాబ్ లకు వరంగా మారిందనే చెప్పాలి. అలాగే, గ్లోబల్ సమ్మిట్ పై కూడా ఇండిగో ఇష్యూ ప్రభావం పడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Read Also: యూఎస్ డాలర్‌కు గుడ్ బై.. ప్రముఖ ఆర్థిక వేత్త సంచలన ట్వీట్

Follow Us On: Facebook

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>