కలం, వెబ్ డెస్క్: ఆసక్తి, అంకితభావం ఉండాలేకానీ ఏ రంగంలోనైనా రాణించవచ్చు. అందుకు ఉదాహరణే భవిత మండవ (Bhavitha Mandava). హైదరాబాద్‌కు చెందిన ఈ అమ్మాయి ప్రస్తుతం ఫ్యాషన్ ప్రపంచంలో సరికొత్త స్టార్‌గా వెలిగిపోతోంది. న్యూయార్క్‌లో జరిగిన ఫ్రెంచ్ లగ్జరీ బ్రాండ్ ‘షానెల్’ ఫ్యాషన్ బ్రాండ్ ‘మెటియర్స్ డి ఆర్ట్ 2026’ షోను ఓపెన్ చేసి చరిత్ర సృష్టించింది. సబ్‌వే స్టేషన్‌లో జరిగిన ఈ గ్రాండ్ ఈవెంట్‌లో భవిత రన్‌వేను ఆకట్టుకుని, గ్లోబల్ ఫ్యాషన్ వరల్డ్‌ను ఆకర్షించింది. కుమార్తె ర్యాంప్ వాక్ లైవ్ వీడియో చూస్తూ భవిత తల్లిదండ్రులు సంతోషంతో పొంగిపోతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒక ఇండియన్ మోడల్ షానెల్ షో ఓపెనర్ గా వాక్ ప్రారంభించడం ఇదే మొదటిసారి కావడంతో వీడియో చూసినవారంతా ఆమెని చూసి గర్వపడుతున్నట్టు కామెంట్స్ చేస్తున్నారు.
షోలో గ్రేస్‌ఫుల్ వాక్‌తో ఫ్యాషన్ ప్రియులను మెస్మరైజ్ చేసింది భవిత. క్లాసిక్ ఎలిగెంట్ స్టైల్స్, మోడరన్ లుక్‌లో కనిపించింది. సరికొత్త ఫ్యాషన్ దుస్తులతో ర్యాంప్‌పై నడుస్తున్న వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. హైదరాబాద్‌లోని తల్లిదండ్రులు ఈ షోను లైవ్ స్ట్రీమింగ్‌లో చూస్తూ కన్నీరు పెట్టుకున్నారు. మా అమ్మాయి ఈ రోజును చేరుకోవడానికి చాలా కష్టపడింది. ఇది మా కలలు నెరవేరిన రోజు అని మండవ శ్రీదేవి భావోద్వేగంగా చెప్పారు.
అనుకోకుండా దక్కిన అవకాశం…
భవిత మండవ (Bhavitha Mandava)కి మోడలింగ్ లోకి అనుకోకుండా ప్రవేశించింది. ఓసారి యునైటెడ్ స్టేట్స్‌లో ఆమె ట్రైన్ కోసం ఎదురుచూస్తోంది. ఆ సమయంలో తను జీన్స్, టీషర్ట్‌లో సాధారణ లుక్‌లో ఉంది. ఆమె లుక్స్‌కు ఆకర్షితుడైన ప్రసిద్ధ ఫ్రెంచ్-బెల్జియన్ డిజైనర్ మాథ్యు బ్లేజీ ఆమెను వెలుగులోకి తెచ్చాడు. భవితలో నాచురల్ లుక్స్ ఉండటంతో ఆమెను మోడల్‌గా ఆహ్వానించాడు. సినిమా సీన్‌లా అనిపించిన ఈ సంఘటన, మోడలింగ్, కెమెరాలు లేదా లగ్జరీ ఫ్యాషన్ గురించి ఏమీ తెలియని భవిత జీవితంలో నిజమైంది.
హైదరాబాద్ లో పుట్టిన భవిత తన బ్యాచిలర్స్ ఆఫ్ ఆర్చిటెక్చర్ డిగ్రీని JNTUలో పూర్తి చేసింది. ఆ తర్వాత యుఎస్‌కు ఇంటరాక్టివ్ డిజైన్, మీడియాలో మాస్టర్స్ చేసేందుకు వెళ్లింది. 2024లో మాథ్యు బ్లేజీ ఆమెకు మోడలింగ్ అవకాశం ఇచ్చిన తర్వాత ప్రయత్నాలు మొదలుపెట్టింది. అవకాశాలను అందిపుచ్చుకుంటూ కేవలం రెండు వారాల్లోనే ఇటాలియన్ లగ్జరీ బ్రాండ్ బోట్టెగా వెనెటా కోసం స్ప్రింగ్/సమ్మర్ 2025 షోలో మోడల్‌గా డెబ్యూ చేసి ఆకట్టుకుంది. ఒకవైపు చదువుతూనే.. మరోవైపు మోడలింగ్ లో రాణిస్తూ న్యూయార్క్, పారిస్, మిలాన్, లండన్ లో ప్రధాన షోలో టాప్ బ్రాండ్స్‌తో మెరిసింది భవిత. న్యూయర్క్‌లో మెరవడంతో ఎవరీ? భవిత అంటూ ఆమె గురించి తెలుసుకుంటున్నారు నెటిజన్స్.
Read Also: యూఎస్ డాలర్‌కు గుడ్ బై.. ప్రముఖ ఆర్థిక వేత్త సంచలన ట్వీట్
Follow Us On : X(Tiwtter)


