Mobile Popup Ad
Mobile Popup Ad

నల్గొండ వాసులకు గుడ్‌న్యూస్ చెప్పిన కేంద్రం

కలం, నల్లగొండ బ్యూరో: నకిరేకల్-నాగార్జునసాగర్ జాతీయ రహదారి-565 (Nakirekal-Nagarjunasagar Highway) అభివృద్ధి పనులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు నల్లగొండ పట్టణ పరిధిలో కిలోమీటర్ 20.300 నుంచి 23.730 వరకు విస్తరించి ఉండగా, నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్‌లోని పానగల్ బైపాస్ రోడ్డు నుంచి డీఈఓ ఆఫీస్ వరకు రోడ్డు విస్తరణ కోసం కేంద్ర ప్రభుత్వం రూ14.45 కోట్లు మంజూరు చేసింది. రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన వివరాల ప్రకారం.. రూ.14.45 కోట్ల అంచనా వ్యయంతో ఈ పనులకు పరిపాలనా, సాంకేతిక, ఆర్థిక ఆమోదాలు లభించాయి. బ్లాక్ టాపింగ్ ద్వారా రహదారి ఉపరితలాన్ని మెరుగుపరచనున్నారు. తెలంగాణ ఆర్ అండ్ బీ శాఖ సమర్పించిన ప్రతిపాదనకు ఎటువంటి మార్పులు లేకుండా పూర్తిస్థాయిలో ఆమోదం లభించింది. టెక్నికల్ నోట్‌లో పేర్కొన్న గడువులోనే పనులను పూర్తి చేయాలని మంత్రిత్వ శాఖ ఆదేశించింది.

అలాగే టెండర్ ఖర్చు ఆమోదించిన అంచనా వ్యయాన్ని 5 శాతం మించితే, సవరణ ఆమోదం తీసుకోవాలని స్పష్టం చేసింది. అయితే గతంలో పానగల్ బైపాస్ రోడ్డు (ఇందిరా గాంధీ విగ్రహం) నుంచి రామగిరి, క్లాక్ టవర్ సెంటర్, డీఈఓ ఆఫీస్ మీదుగా సాగర్ రోడ్డు వరకు జాతీయ రహదారి 565 రోడ్డు విస్తరణ కోసం ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది రోడ్డుకు ఇరువైపులా ఉన్న షాపులు, పలువురి గృహాలు విస్తరణలో పోతుండడంతో ప్రజలు, వ్యాపారులు ఆందోళన చేపట్టారు. వీరిలో కొందరు కోర్టుకు సైతం వెళ్లారు. అప్పటినుంచి ఈ రోడ్డు ఎలాంటి విస్తరణకు నోచుకోకుండా పెండింగ్‌లోనే ఉండిపోయింది. కాగా, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చొరవ తీసుకొని ఈ హైవే రోడ్డును బైపాస్ మీదుగా మార్చారు. పెండింగ్‌లో ఉన్న ఈ రోడ్డుకు నిధుల మంజూరు కోసం పలుమార్లు మంత్రి కోమటిరెడ్డి కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి మంత్రిని కలిశారు. ఫలితంగా ఎట్టకేలకు పెండింగ్లో ఉన్న రోడ్డు అభివృద్ధి పనులకు రూ. 14.45 కోట్లు మంజూరయ్యాయి.

Read Also: కవిత కొత్త పార్టీపై బీఆర్ఎస్ స్టాండ్ ఇదే..!

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>