కలం, వెబ్ డెస్క్: ప్రముఖ ఆర్థికవేత్త, రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి(Robert Kiyosaki) యూఎస్ డాలర్(US Dollar)కు సంబంధించి సంచలన ట్వీట్ చేశారు. డాలర్ మీద పెట్టుబడులు పెట్టడం సరికాదని ఆయన వ్యాఖ్యానించారు. యూఎస్ కరెన్సీ క్రమంగా పతనం అవుతోందని కూడా పేర్కొన్నారు. బ్రిక్స్ దేశాలు బంగారం ఆధారంగా ఓ కొత్త కరెన్సీని రూపొందించే ఆలోచన చేస్తున్నాయని ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం.
‘బ్రిక్స్ దేశాలు(BRICS) బంగారం ఆధారంగా ఉండే కొత్త కరెన్సీ ‘యూనిట్’ను ప్రకటించాయి. ఇక అమెరికా డాలర్ పని అయిపోయింది… బై బై యూఎస్ డాలర్’’ అని తన ‘ఎక్స్’ పోస్ట్‌లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పెట్టుబడిదారులు అప్రమత్తంగా ఉండాలని, నష్టాలకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
‘‘నా అంచనా ప్రకారం యూఎస్ డాలర్ల(US Dollar)ను పొదుపుగా ఉంచుకొనే వారు భారీగా నష్టపోతారు. అధిక ద్రవ్యోల్బణం వాళ్లను తీవ్రంగా దెబ్బతీయవచ్చు’’ అని హెచ్చరించారు. తాను మాత్రం బంగారం, వెండి, బిట్‌కాయిన్‌లో పెట్టుబడులు పెడతానని స్పష్టం చేశారు.
ఇప్పటికే బంగారం, వెండిపై దీర్ఘకాలంగా పెట్టుబడులు పెడుతున్న కియోసాకి, గత కొన్నేళ్లుగా బిట్‌కాయిన్ కూడా డాలర్ క్షీణతకు ఎదురువేసే ఆస్తులుగా అభివర్ణిస్తున్నారు. ఆయన తాజా వ్యాఖ్యలు గ్లోబల్ ఫైనాన్షియల్ మార్కెట్లో మరోసారి చర్చనీయాంశంగా మారాయి. మరి నిజంగానే డాలర్ క్రమంగా క్షిణిస్తోందా? డాలర్ మీద పెట్టుబడి పెట్టడం కంటే.. బంగారం మీద పెట్టుబడి పెట్టిన వాళ్లే లాభాలు పొందుతారా? అన్నది వేచి చూడాలి. మొత్తంగా ప్రముఖ ఆర్థిక నిపుణుడు, రచయిత రాబర్ట్ కియోసాకి చేసిన ఈ ప్రకటన సంచలనంగా మారింది.

Read Also: హైదరాబాద్ ఉక్కిరిబిక్కిరి.. నగరంలో పెరిగిన వాయు కాలుష్యం!
Follow Us On: Facebook


