Mobile Popup Ad
Mobile Popup Ad

పోలీసుల యాక్షన్​.. గంటలోనే 9 తులాల బంగారం రికవరీ

కలం, ​మెదక్ : మెదక్ జిల్లా తూప్రాన్ (Toopran) పోలీసులు ఒక గంటలోనే సుమారు 9 తులాల బంగారం రికవరీ చేశారు. శుక్రవారం ఉదయం తమ బ్యాగ్​ పోయిందని బాధితులు​ 100కు ఫిర్యాదు చేశారు. ఆ బ్యాగ్​ లో 9 తులాల బంగారం ఉందని తెలిపారు. వెంటనే స్పందించిన తూప్రాన్​ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారించారు. దీంట్లో ఫిర్యాదుదారుడు బైక్​ పై వెళ్తుండగా బంగారం ఉన్న బ్యాగ్​ కిందపడిపోయిందని తేలింది.

పోలీసులు పరిసరాల్లో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించగా.. ఓ వ్యక్తి ఆ బ్యాగ్​ ను తీసుకున్నట్లు గుర్తించారు. ఆ వ్యక్తి దగ్గరకు వెళ్లగా అతడు పోలీసులకు బ్యాగ్​ అప్పగించాడు. స్వాధీనం చేసుకున్న బ్యాగులో సుమారు 9 తులాల బంగారు చైన్లు ఉన్నాయి. వీటిని పోలీసులు యజమానికి అందజేశారు. బంగారం రికవరీలో వేగంగా స్పందించిన సీఐ రంగాకృష్ణ, ఎస్సై గంగరాజు నేతృత్వంలోని పోలీసు సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. అలాగే, బంగారాన్ని నిజాయితీగా పోలీసులకు అందజేసిన నాగరాజు, కృష్ణలను శాలువాలతో సన్మానించారు.

Read Also: యుద్ధ భయం.. ముఖ్యమంత్రులకు మోదీ కీలక ఆదేశాలు

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>